ఆదర్శ పల్లెలే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం : జడ్పీ చైర్‌పర్సన్‌

ABN , First Publish Date - 2022-05-29T05:28:10+05:30 IST

ఆదర్శ పల్లెలే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభ అన్నారు. శనివారం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో స్థాయీ సంఘ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఐదో విడత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా అధికారులందరూ రోజువారి ప్రణాళికా బద్ధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని, రాష్ట్రంలో ఉన్న అన్ని పల్లెలు దేశంలోనే ఆదర్శ పల్లెలుగా మార్చడానికి ప్రభుత్వం రూపొందిచడం జరిగిందని, ఇప్పటికే ప్రతీ గ్రామంలో అన్ని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్‌ ట్రాలీలు, ట్యాంకర్లను ఇవ్వడం జరిగిందని తెలిపారు.

ఆదర్శ పల్లెలే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం : జడ్పీ చైర్‌పర్సన్‌
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ శోభ

కామారెడ్డి, మే 28: ఆదర్శ పల్లెలే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభ అన్నారు. శనివారం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో స్థాయీ సంఘ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఐదో విడత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా అధికారులందరూ రోజువారి ప్రణాళికా బద్ధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని, రాష్ట్రంలో ఉన్న అన్ని పల్లెలు దేశంలోనే ఆదర్శ పల్లెలుగా మార్చడానికి ప్రభుత్వం రూపొందిచడం జరిగిందని, ఇప్పటికే ప్రతీ గ్రామంలో అన్ని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్‌ ట్రాలీలు, ట్యాంకర్లను ఇవ్వడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 525 గ్రామ పంచాయతీల్లో వైకుంఠధామాలు, 526 గ్రామాల్లో డంపింగ్‌ యార్డులు పూర్తి అయ్యాయని, ప్రతీ వైకుంఠధామంకు మిషన్‌ భగీరథ ద్వారా నీటి సదుపాయం కల్పించే విధంగా ఆదేశాలు ఇచ్చామన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రజల్లో మా గ్రామాన్ని మేము అభివృద్ధి చేసుకుందామని ప్రభుత్వ సంకల్పానికి మేము కూడా భాగస్వామ్యం అవుతామని మార్పు వచ్చిందని ప్రజలు కూడా స్వచ్ఛంధంగా పాల్గొంటున్నారని ఇది చాలా మంచి పరిణామమని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య ఇంకా పెంచాలని, పెరిగేట్లు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎల్లారెడ్డి ఆసుపత్రిలో పోస్టుమార్టం బిల్డింగ్‌ పని తొందరగా పూర్తి చేయాలని నాగిరెడ్డిపేట్‌ జడ్పీటీసీ కోరగా ప్రక్రియ పూర్తయిందని త్వరలోనే పూర్తిచేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో సాయాగౌడ్‌, జడ్పీటీసీలు శ్రీలత, ఉషాగౌడ్‌, మనోహర్‌రెడ్డి, చంద్రబాగా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-29T05:28:10+05:30 IST