Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 03 Nov 2021 18:50:59 IST

ఆయనే ‘ఆహా’కు ఎన‌ర్జీ: అల్లు అర్జున్

twitter-iconwatsapp-iconfb-icon

100 పర్సెంట్‌ తెలుగు ఓటీటీ మాధ్య‌మంగా ‘ఆహా’ ఓటీటీ.. గ్లోబెల్ రేంజ్‌లో ఎగ్జ‌యిట్‌మెంట్‌ను పెంచుతూ అంద‌రి అంచ‌నాల‌ను మించేలా దూసుకెళుతోంది. ఈ ఏడాది దీపావళికి ఆ ఎగ్జ‌యిట్‌మెంట్‌ను రెట్టింపు చేసేలా పండుగ ఆనందాల‌ను పీక్స్‌కు తీసుకెళ్లేలా ఆహా యాప్‌ను 2.0గా అప్‌గ్రేడ్ చేసి స‌రికొత్త ఫీచ‌ర్స్‌తో వీక్ష‌కుల‌కు అందిస్తూ సంబ‌రాల‌ను తీసుకొచ్చింది ఆహా. అందులో భాగంగా ‘ఐకాన్ స్టార్ ప్రెజెంట్స్ ఆహా 2.0’  కార్య‌క్ర‌మాన్ని తాజాగా హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. 

ఈ సంద‌ర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘ఆహా ఇంత త్వ‌ర‌గా.. ఇంత‌ పెద్ద స‌క్సెస్ అవుతుందని అస్సలు అనుకోలేదు. అందుకు కార‌ణం ప్ర‌పంచంలోని తెలుగు ప్రేక్ష‌కులే. అంద‌రికీ మా ధ‌న్య‌వాదాలు. ఒక నెంబ‌ర్ వ‌న్ తెలుగు ఓటీటీగా ఆహా ఉన్నందుకు నాకెంతో గ‌ర్వంగా ఉంది. దీని స‌క్సెస్‌కు కార‌ణమైన వ్య‌క్తులు గురించి మాట్లాడాలంటే ముందు మా నాన్న‌గారు అల్లు అర‌వింద్‌గారి గురించి మాట్లాడాలి. తెలుగు ప్రేక్ష‌కుల కోసం ఓ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్ తీసుకురావాల‌నే ఆలోచ‌న ఆయనదే. డెబ్బై ఏళ్లు వ‌య‌సు వ‌చ్చిన త‌ర్వాత కాస్త రిలాక్స్ అవుతూ, రిటైర్ అయ్యే స‌మ‌యంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ టేక‌ప్ చేసి పాతికేళ్ల లోపు పిల్ల‌ల‌తో హ్యాంగోవ‌ర్‌చేస్తూ వ‌చ్చిన ఆయనే ఆహాకు ఎన‌ర్జీ. రామేశ్వ‌ర్ రావుగారి కుటుంబం నుంచి ఈ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేస్తున్న రామ్ జూప‌ల్లిగారికి ధ‌న్య‌వాదాలు. ఆయ‌న కాంట్రీబ్యూష‌న్ లేక‌పోతే ఆహా ఈ స్థాయిలో నిలిచి ఉండేది కాదు. అలాగే మీ వెంట‌నే నేను అంటూ మా వెన‌క నిల‌బ‌డిన దిల్‌రాజుగారికి స‌భాముఖంగా థాంక్స్ చెప్పుకుంటున్నాను. వీరంద‌రూ లేక‌పోతే ఈ జ‌ర్నీ పూర్తయ్యేది కాదు. క్రియేటివ్ ప‌రంగా వంశీ పైడిప‌ల్లి పిల్ల‌ర్‌గా నిల‌బ‌డి ముందుకు న‌డిపించాడు. మూడేళ్లుగా అజిత్ ఇదే ప‌నిగా దీన్ని ఈ రేంజ్‌కు తీసుకొచ్చారు. అలాగే ఆహా టీమ్ పాత్ర ఎంతో ముఖ్యమైంది. ఆహాలో వెర్ష‌న్ 2.0 వ‌స్తుంది. ఇది ఎక్స్‌ట్రార్డిన‌రీ ఫ్లాట్‌ఫామ్‌. ఇది ఇంత బాగా రావ‌డానికి అల్లు వెంక‌టేశ్ కార‌ణం. ఈ స‌క్సెస్‌లో కార‌ణ‌మైన ఆహా టీమ్‌కు థాంక్స్‌’’ అన్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement