గ్రామాల్లో ఐసీఎంఆర్‌ సిరమ్‌ సర్వే

ABN , First Publish Date - 2022-01-22T04:43:53+05:30 IST

కొవిడ్‌ వాక్సినేషన్‌ జోరుగా సాగుతున్న నేపథ్యంలో సామూహిక యాంటీబాడీల పెరుగుదలపై అంచనా వేసేందుకు ‘ఐసీఎంఆర్‌ –ఎన్‌ఐఎన్‌’ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌–నేచర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రీషన్‌) సిరమ్‌ సర్వే నిర్వహిస్తున్నారు. మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 10 గ్రామాల్లో నమూనాలను సేకరించారు. జీపీఎస్‌ అనుసంధానం చేస్తు

గ్రామాల్లో ఐసీఎంఆర్‌ సిరమ్‌ సర్వే
జెండాపల్లిలో రక్త నమూనాలను సేకరిస్తున్న ఐసీఎంఆర్‌ సిబ్బంది

యాంటీబాడీల గుర్తింపునకు 40 మంది రక్త నమూనాల సేకరణ


తూప్రాన్‌/చేగుంట, జనవరి 21: కొవిడ్‌ వాక్సినేషన్‌ జోరుగా సాగుతున్న నేపథ్యంలో సామూహిక యాంటీబాడీల పెరుగుదలపై అంచనా వేసేందుకు ‘ఐసీఎంఆర్‌ –ఎన్‌ఐఎన్‌’ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌–నేచర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రీషన్‌) సిరమ్‌ సర్వే నిర్వహిస్తున్నారు. మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 10 గ్రామాల్లో నమూనాలను సేకరించారు. జీపీఎస్‌ అనుసంధానం చేస్తు సిరమ్‌ సర్వేను కొనసాగిస్తున్నారు. తూప్రాన్‌ మండలం జెండాపల్లిలో శుక్రవారం ఐసీఎంఆర్‌ సిబ్బంది 40 మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. మొదటి డోసు, రెండో డోసు, బూస్టర్‌ డోసు తీసుకున్న వ్యక్తుల నుంచి నమూనాలు తీసుకున్నారు. సర్వేలో ఐసీఎంఆర్‌ ప్రతినిధులు డాక్టర్‌ కిరణ్‌కుమార్‌, ఖాధర్‌బాబు, రాజ్యలక్ష్మీ, పీహెచ్‌సీ సీహెచ్‌వో బాల్‌నర్సయ్య, సూపర్‌వైజర్‌ పల్లవి, ఏఎన్‌ఎం జ్యోతిలక్షి, అంగన్‌వాడీ టీచర్‌ వినోద, ఆశ కార్యకర్త ఎల్లమ్మ పాల్గొన్నారు. 

నార్సింగ్‌లో..

చేగుంట, జనవరి 21: మెదక్‌ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో ఐసీఎంఆర్‌ వైద్య బృందం పర్యటించింది. వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో యాంటీబాడీల గుర్తింపు కోసం పలువురి నుంచి రక్త నమూనాలు సేకరించారు. ఈ సందర్భంగా  ఐసీఎంఆర్‌ బృంద సభ్యుడు సమరసింహ మాట్లాడుతూ కరోనా టీకాతో యాంటీబాడీల పెరుగుదలను తెలుసుకోవడానికి సర్వే ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి, సంక్రమణ సామర్థ్యం తదితర అంశాలను గుర్తిస్తే వైరస్‌ నియంత్రణ మార్గదర్శకాలు రూపొందించడానికి ఉపయోగపడుతుంది తెలియజేశారు. సర్వేలో టెక్నికల్‌ ఆఫీసర్‌ ఋషికేశ్‌ పాండా, ఏఎన్‌ఎమ్‌ జన్సీ, స్థానిక వైద్యులు రాకేష్‌  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T04:43:53+05:30 IST