ఆర్‌బీఐ నిర్ణయం వెలువడిన వెంటనే ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) తమ రెపో ఆధారిత రుణాల వడ్డీ రేట్లు పెంచేశాయి. రెపో ఆధారిత రుణాల వడ్డీ రేటును పీఎన్‌బీ 7.40 శాతం నుంచి 7.90 శాతానికి పెంచింది. ఈ నిర్ణయం ఈ నెల 8 నుంచి అమల్లోకి వస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కూడా తన రెపో ఆధారిత రుణాల వడ్డీ రేటును 9.10 శాతానికి పెంచింది. ఈ పెంపు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చినట్టు బ్యాంక్ పేర్కొంది. త్వరలోనే మరిన్ని బ్యాంకులు ఈ రెండు బ్యాంకులను అనుసరించే వీలుంది.