వడ్డీ రేట్లు పెంచిన ఐసీఐసీఐ...

ABN , First Publish Date - 2022-05-17T00:19:10+05:30 IST

ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఐసీఐసీఐ) బ్యాంక్ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది.

వడ్డీ రేట్లు పెంచిన ఐసీఐసీఐ...

హైదరాబాద్ : ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఐసీఐసీఐ) బ్యాంక్ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు వెల్లడించింది. కాగా... సీనియర్ సిటిజన్స్‌కు 0.5 శాతం అదనపు వడ్డీ కూడా వస్తుంది. ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీలపై కూడా వడ్డీ రేటు పెరిగింది. ప్రైవేటు రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది.


వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం రూ. 2 కోట్లకు లోపు ఎఫ్‌డీలకు వర్తిస్తుందని బ్యాంక్  నేపథ్యంలో... 290 రోజుల నుంచి పదేళ్లలోపు కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లకు కొత్త రేట్లు వర్తిస్తాయి. ఈ క్రమంలో... 290 రోజుల నుంచి ఏడాదిలోపు ఎఫ్‌డీలపై 4.4 శాతం వడ్డీని అందించేది. ఇప్పుడు ఈ వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్ల మేర పెరిగింది. అంటే ఇకపై కస్టమర్లకు ఈ ఎఫ్‌డీలపై 4.5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఏడాది నుంచి రెండేళ్ల కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఇపన్పటివరకు 5 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేసేది. ఇప్పుడు ఈ కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై 5.1 శాతం వడ్డీ అందనుంది. ఇలాగే వివిధ కేటగరీల్లోని డిపాజిట్లపూ కూడా వడ్డీ రేట్లు పెరిగాయి. ఇక... ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.45 శాతం నుంచి 5.6 శాతానికి ఎగసింది. అలాగే సీనియర్ సిటిజన్స్ 0.5 శాతం వడ్డీ రేటును అదనంగా పొందొచ్చు. కాగా బ్యాంక్ ప్రత్యేకంగా ఆఫర్ చేస్తున్న ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్‌డీలపై 6.35 శాతం వడ్డీ రేటు లభిస్తోంది.

Updated Date - 2022-05-17T00:19:10+05:30 IST