మొబైల్ ఏటీఎంలను ప్రారంభించిన ఐసీఐసీఐ

ABN , First Publish Date - 2020-04-10T22:35:07+05:30 IST

ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాకింగ్ సంస్థ ఐసీఐసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. నోయిడాతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని

మొబైల్ ఏటీఎంలను ప్రారంభించిన ఐసీఐసీఐ

నోయిడా: ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాకింగ్ సంస్థ ఐసీఐసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. నోయిడాతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని జిల్లాల్లో రెండు మొబైల్ ఏటీఎంలను ప్రారంభించాలని నిర్ణయించింది. వచ్చే వారం నుంచే వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన ప్రజల వద్దకే బ్యాంకింగ్ సేవలను తీసుకెళ్లాని నిర్ణయించినట్టు ఈ సందర్భంగా ఐసీఐసీఐ తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఇవి అధికారులు క్వారంటైన్ విధించిన ప్రాంతాల్లో తిరుగుతాయని బ్యాంకు తెలిపింది. సాధారణ ఏటీఎంలలో లభించే అన్ని సేవలు ఈ మొబైల్ ఏటీఎంలలో లభిస్తాయని పేర్కొంది. నగదు ఉపసంహరణతోపాటు నగదు బదిలీ, పిన్ మార్పిడి, మొబైల్ ఫోన్ల రీచార్జ్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణ వంటి సేవలు లభిస్తాయని వివరించింది. నేషనల్ కేపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్)లోని రెసిడెన్షియల్ సొసైటీల్లో ఇప్పటికే ఏటీఎం వ్యాన్లను మోహరించినట్టు ఐసీఐసీఐ తెలిపింది. 

Updated Date - 2020-04-10T22:35:07+05:30 IST