వన్డే జట్టు పగ్గాలు రోహిత్‌కు అప్పగించడంపై ఐసీసీ ఏమందో తెలుసా?

ABN , First Publish Date - 2021-12-10T00:12:17+05:30 IST

టీమిండియా వన్డే జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమిస్తూ సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఐసీసీ

వన్డే జట్టు పగ్గాలు రోహిత్‌కు అప్పగించడంపై ఐసీసీ ఏమందో తెలుసా?

న్యూఢిల్లీ: టీమిండియా వన్డే జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమిస్తూ సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఐసీసీ సహా మాజీ క్రికెటర్లు, క్రీడా విశ్లేషకులు స్వాగతించారు.  టీమిండియా వన్డే క్రికెట్‌లో ఇది నూతన శకమని ఐసీసీ అభివర్ణించింది.


ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మాట్లాడుతూ.. రోహిత్ నియామకాన్ని ఆహ్వానించాడు. బీసీసీఐ మంచి నిర్ణయం తీసుకుందన్నాడు. కోహ్లీ, రోహిత్ అన్ని ఫార్మాట్లలోనూ ఆడుతున్నారని, ఇప్పుడు కోచ్ ద్రావిడ్ జట్టును ఎలా నడిపిస్తాడో వేచి చూడాల్సిందేనని క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే పేర్కొన్నాడు.


రెండు వేర్వేరు ఫార్మాట్లకు ఇద్దరు వేర్వేరు కెప్టెన్లను నియమించడం వల్ల డ్రెస్సింగ్ రూములో మార్పులు తథ్యమని క్రీడా విశ్లేషకుడు, కాలమిస్ట్ అయాజ్ మీనన్ అభిప్రాయపడ్డాడు. రోహిత్, కోహ్లీని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగేందుకు కోచ్ ద్రావిడ్ పెద్దన్న పాత్ర పోషించాల్సి ఉంటుందన్నాడు.


రోహిత్‌కు వన్డే జట్టు పగ్గాలు అప్పగించడంపై ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ స్పందిస్తూ.. వన్డే క్రికెట్‌లో ‘మెన్ ఇన్ బ్లూ’ను నడిపించేందుకు నంబరు 45 (రోహిత్ శర్మ జెర్సీ నంబరు) సిద్ధమని పేర్కొంది.  

Updated Date - 2021-12-10T00:12:17+05:30 IST