ఐసీసీ వన్డే జట్టులో..భారత క్రికెటర్లకు దక్కని బెర్త్‌

ABN , First Publish Date - 2022-01-21T09:00:21+05:30 IST

ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన భారత క్రికెట్‌ జట్టుకు ఐసీసీ మరోసారి షాకిచ్చింది. టీ20 మాదిరిగానే.. గతేడాదికి

ఐసీసీ వన్డే జట్టులో..భారత క్రికెటర్లకు దక్కని బెర్త్‌

టెస్ట్‌ జట్టులో ముగ్గురికి చోటు

దుబాయ్‌: ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన భారత క్రికెట్‌ జట్టుకు ఐసీసీ మరోసారి షాకిచ్చింది. టీ20 మాదిరిగానే.. గతేడాదికి సంబంధించి తమ వన్డే జట్టులోనూ భారత్‌ నుంచి ఒక్క ఆటగాడికి కూడా చోటివ్వలేదు. అయితే పరిమిత ఓవర్లలో నిరాశ ఎదురైనా 2021 టెస్టు జట్టులో మాత్రం ముగ్గురు భారత క్రికెటర్లకు చోటు లభించింది. కేన్‌ విలియమ్సన్‌ నేతృత్వంలోని ఈ జట్టులో రోహిత్‌ శర్మ, రిషభ్‌ పంత్‌, అశ్విన్‌ ఉన్నారు. 

ఐసీసీ వన్డే టీమ్‌ (2021): బాబర్‌ ఆజమ్‌ (కెప్టెన్‌), ఫఖర్‌ జమాన్‌ (పాక్‌), జానెమన్‌ మలాన్‌, డుస్సెన్‌ (దక్షిణాఫ్రికా), షకీబల్‌, ముష్ఫికర్‌, ముస్తాఫిజుర్‌ (బంగ్లాదేశ్‌), హసరంగ, చమీర (శ్రీలంక), సిమి సింగ్‌, పాల్‌ స్టిర్లింగ్‌ (ఐర్లాండ్‌).

ఐసీసీ టెస్టు జట్టు: విలియమ్సన్‌ (కెప్టెన్‌), జేమిసన్‌ (కివీస్‌), రోహిత్‌, పంత్‌, అశ్విన్‌ (భారత్‌), కరుణరత్నె (శ్రీలంక), లబుషేన్‌ (ఆసీస్‌), రూట్‌ (ఇంగ్లండ్‌), ఫవాద్‌, షహీన్‌షా, హసన్‌ అలీ (పాక్‌).

Updated Date - 2022-01-21T09:00:21+05:30 IST