Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీ20 నిబంధనల్లో భారీ మార్పులు.. ఇకపై స్లో ఓవర్ రేట్‌కు భారీ మూల్యం!

దుబాయ్: టీ20 నిబంధనల్లో ఐసీసీ భారీ మార్పులు చేసింది. ఇకపై స్లో-ఓవర్ రేట్‌కు మ్యాచ్ మధ్యలోనే జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే, టీ20 ద్వైపాక్షిక అంతర్జాతీయ సిరీస్‌లలో మ్యాచ్ మధ్యలో డ్రింక్స్ విరామం ప్రకటించింది. ఇంతకుముందులా స్లో ఓవర్ రేటుకు మ్యాచ్ తర్వాత జరిమానా కాకుండా మ్యాచ్ మధ్యలోనే దానిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫీల్డింగ్ చేసే జట్టు భారీ శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 


ఇన్నింగ్స్ చివరి ఓవర్ మొదటి బంతిని నిర్దేశిత సమయానికి వేయాల్సి ఉంటుంది. దీనిని ఉల్లంఘిస్తే కనుక అప్పటికి ఎన్ని ఓవర్‌లు, లేదంటే ఎన్ని బంతులు మిగిలి ఉంటే అన్నింటికీ 30 యార్డ్స్ వెలుపల ఉన్న ఫీల్డర్లలో ఒకరిని మాత్రమే తగ్గించాల్సి ఉంటుంది. అంటే నలుగురిని మాత్రమే 30 యార్డ్స్‌లో ఫీల్డింగ్‌కు అనుమతిస్తారు. మామూలుగా అయితే పవర్‌ప్లే తర్వాత ఐదుగురిని అనుమతిస్తారు. కాబట్టి ఫీల్డింగ్ చేసే జట్టు చాలా జాగ్రత్తగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. సిరీస్ ప్రారంభానికి ఇరు జట్లు పరస్పర అంగీకారంతో మ్యాచ్ మధ్యలో రెండున్నర నిమిషాల పాటు డ్రింక్స్ బ్రేక్ తీసుకోవచ్చు.


ఐసీసీ ప్రకటించిన తాజా నిబంధనలు వెస్టిండీస్-ఐర్లాండ్ మధ్య జమైకాలోని సబీనా పార్క్‌లో ఈ నెల 16న ప్రారంభం కానున్న మ్యాచ్ నుంచి అమల్లోకి వస్తాయి. అలాగే, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ జట్ల మధ్య సెంచూరియన్‌లో ఈ నెల 18న మొదలు కానున్న తొలి మ్యాచ్ ద్వారా మహిళా క్రికెట్‌‌లోనూ ఇవి అమల్లోకి వస్తాయని ఐసీసీ ప్రకటించింది.

Advertisement
Advertisement