గల్ఫ్‌లోని చిన్నారులకు పోతన భాగవత పద్య పోటీలు

ABN , First Publish Date - 2022-08-04T16:55:35+05:30 IST

'రవి కాంచిన పోతన భాగవతం' పేరిట 2వ ప్రపంచవ్యాప్త భాగవత పద్య పోటీలను పిల్లలకు న్యూజిలాండ్ నుండి సింగపూర్, మలేషియా, ఇండియా, గల్ఫ్, యూరప్, అమెరికా వరకు ఐబాం(iBAM) సంస్థ వారు నిర్వహించడం జరిగింది.

గల్ఫ్‌లోని చిన్నారులకు పోతన భాగవత పద్య పోటీలు

ఐబాం(iBAM) మరియు గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యములో కార్యక్రమం

ఎన్నారై డెస్క్: 'రవి కాంచిన పోతన భాగవతం' పేరిట 2వ ప్రపంచవ్యాప్త భాగవత పద్య పోటీలను పిల్లలకు న్యూజిలాండ్ నుండి సింగపూర్, మలేషియా, ఇండియా, గల్ఫ్, యూరప్, అమెరికా వరకు ఐబాం(iBAM) సంస్థ వారు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా గల్ఫ్ దేశాలలోని పిల్లలకు గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యములో గల్ఫ్‌లోని 6 దేశాలలోని 9 తెలుగు సంఘాల భాగస్వామ్యముతో ఈ పోటీలు నిర్వహించారు. 6-9 ఏళ్ల పిల్లలకు, 10-13 సంవత్సరాల వయస్సు పిల్లలకు, 14 నుండి 18 సంవత్సరాల వయస్సు పిల్లలకు విడివిడిగా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ఇండియా నుండి ప్రముఖ భాషా, సాహితీ వేత్తలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.  పిల్లలలోని పద్య పఠనా ప్రతిభను వారు కొనియాడారు. విదేశాలలో ఉన్నప్పటికీ పిల్లల్ని మన భాష సంస్కృతుల పట్ల ఆకర్షితులు అయ్యేలా ప్రోత్సహిస్తున్నందుకు తల్లితండ్రులను అభినందించారు. 


ఈ పోటీల ఫలితాలను సోమవారం సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో ప్రకటించారు. ఈ ముగింపు ఉత్సవానికి ఐబాం(iBAM) ఫౌండర్ మల్లిక్ పుచ్చా, ఐబాం గ్లోబల్ కోఆర్డినేటర్స్ ఇందిర, శ్రీకాంత్, వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు వంశీ రామ రాజు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్యలోని సభ్యులు అయినటువంటి తెలుగు సంఘాల అధ్యక్షుల కృషిని కొనియాడారు. అలాగే విజేతలను అభినందించారు. గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య తరపు కుదరవల్లి సుధాకర్ మాట్లాడుతూ ఐబాం(iBAM) ఫౌండర్ మల్లిక్ పుచ్చా, వారి కార్యవర్గ బృందానికి, గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య, ఐబాం(iBAM) సంధాన కర్తగా వ్యవహరించిన లలిత ధూళిపాళకు ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన టీఆర్ శ్రీనివాస్ ప్రసాద్, శొంఠి నాగేశ్వర శ్రీనివాస్, కోప్పడ వేణుగోపాల రావు, ఎన్ఎన్ మూర్తి, హరి బాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. 


అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా జరుపుకోవటానికి ప్రధాన కారకులైన గల్ఫ్‌లోని తెలుగు సంఘాల అధ్యక్షులు, తెలుగు సంఘాల ఐక్య వేదిక, కువైత్ అధ్యక్షులు సుధాకర్ రావు, సౌదీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలు దీపికా రావి, తెలుగు కళా సమితి, ఒమన్ కన్వీనర్ అనిల్ కడించర్ల, తెలుగు తరంగిణి, రాస్ అల ఖైమ అధ్యక్షులు సురేష్, ఫుజైరా తెలుగు ఫ్యామిలీస్ ప్రదీప్ కుమార్, ఆంధ్ర కళా వేదిక, ఖతార్ అధ్యక్షులు వెంకప్ప భాగవతుల, తెలుగు కళా సమితి, బహ్రెయిన్ అధ్యక్షులు హరిబాబు, తెలుగు కళా సమితి, ఖతార్ తాతాజీ, తెలుగు కళా సమితి, కువైత్ అధ్యక్షులు సుబ్బారావుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వీరితో పాటు సాంకేతిక సహకారంలో ముఖ్య పాత్ర పోషించిన విక్రమ్ సుఖవాసికి, ఇతర కోఆర్డినేటర్స్ మోహన్, కళ్యాణి, రాణి, శారద, మురళీకృష్ణకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు. చివరిగా పోటీలలో పాల్గొన్న పిల్లలందరినీ అభినందించారు. అలాగే వారి తల్లితండ్రులుకు ధన్యవాదాలు తెలియజేసారు. విజేతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ ముగింపు ఉత్సవ కార్యక్రమాన్ని ఆసాంతం రసవత్తరంగా నిర్వహించినందుకు వెంకప్ప భాగవతులకు అభినందనలు తెలియజేసి కార్యక్రమాన్ని ముగించారు. 




















Updated Date - 2022-08-04T16:55:35+05:30 IST