High Alert: ఐబీ హెచ్చరికలు... తెలంగాణ పోలీసుల అప్రమత్తం

ABN , First Publish Date - 2022-08-10T14:23:48+05:30 IST

పంద్రాగస్టుకు ఐబీ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు.

High Alert: ఐబీ హెచ్చరికలు... తెలంగాణ పోలీసుల అప్రమత్తం

హైదరాబాద్: పంద్రాగస్టుకు ఐబీ (IB) హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు (Telangana police) అప్రమత్తమయ్యారు.  లష్కరే తాయిబా (Lashkar-e-Taiba), జైషే మహమ్మద్ (Jaish-e-Mohammed) వంటి ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ హెచ్చరించింది. దేశ రాజధాని పాటు కీలక నగరాలను పాకిస్థాన్ (Pakistan) ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు టార్గెట్ చేసే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు (Central Intelligence Agency) హెచ్చరించాయి. దీంతో హైదరాబాద్‌ (Hyderabad)లోని పర్యాటక ప్రాంతాలు, వీవీఐపీలు ఉండే ప్రదేశాల్లో హై అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport), రైల్వేస్టేషన్లు, బస్టేషన్లు, రద్దీ ప్రదేశాల్లో నిఘాను ముమ్మరం చేశారు.  అటు శంషాబాద్ విమానాశ్రయంలో ఈ నెల 30 వరకు హైఅలర్ట్ కొనసాగిస్తామని అధికారవర్గాలు వెల్లడించాయి. 

Updated Date - 2022-08-10T14:23:48+05:30 IST