సాగుబాయి కుంటను పరిశీలించిన ఐబీ, రెవెన్యూ అధికారులు

ABN , First Publish Date - 2021-12-02T04:58:10+05:30 IST

కొమురవెల్లి మండలం రసూలాబాద్‌ గ్రామ శివారులోని సాగుబాయికుంట స్థలాన్ని కొమురవెల్లి మండల నీటిపారుదల శాఖ ఏఈ రాజేందర్‌, రెవెన్యూ కార్యాలయ అధికారి సంజీవ్‌కుమార్‌ బుధవారం పరిశీలించారు.

సాగుబాయి కుంటను పరిశీలించిన ఐబీ, రెవెన్యూ అధికారులు
స్థానికులతో మాట్లాడుతున్న ఐబీ ఏఈ రాజేందర్‌, రెవెన్యూ కార్యాలయ అధికారి సంజీవ్‌

చేర్యాల, డిసెంబరు 1 : కొమురవెల్లి మండలం రసూలాబాద్‌ గ్రామ శివారులోని సాగుబాయికుంట స్థలాన్ని కొమురవెల్లి మండల నీటిపారుదల శాఖ ఏఈ రాజేందర్‌, రెవెన్యూ కార్యాలయ అధికారి సంజీవ్‌కుమార్‌ బుధవారం పరిశీలించారు. ఎన్నోఏళ్ల నుంచి కొనసాగుతున్న కుంటలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు లే అవుట్‌ కోసం మట్టి, మొర ం నింపి ఉనికి లేకుండా చేస్తున్న విషయం వివాదాస్పదమైంది. ఈ విషయమై వారు స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా అయినాపూర్‌ సర్పంచ్‌ చెరుకు రమణారెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి శెట్టెపల్లి సత్తిరెడ్డి, మత్య్సకార సంఘం జిల్లా నాయకుడు తేలు ఇస్తారి, తాడూరి మల్లేశం అధికారులను కలిశారు. సాగుబాయికుంట ద్వారా 100 నుంచి 150 ఎకరాలు సాగు చేసుకుంటున్నారని, కుంట కనుమరుగుతో సాగు ఇబ్బందులతో పాటు మత్య్సకారులు చేపల పెంపకం లేక ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొన్నదన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా అధికారులు పారదర్శకంగా విచారణ చేపట్టి కుంట హద్దులు నిర్ధారించి, ఆక్రమణకు గురికాకుండా పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. 

Updated Date - 2021-12-02T04:58:10+05:30 IST