ఒంగోలు(కలెక్టరేట్), జూలై 6 : జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో)గా పనిచేస్తున్న పులి శ్రీనివాసులుకు ఐఏఎస్ హోదా లభించింది. ఢిల్లీలో బుధవారం జరిగిన యూనియన్ పబ్లిక్ కమిషన్ కమిటీ సమావేశంలో ఆయనకు ఐఏఎస్ కేడర్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాళ్లూరు మండలం రజానగరం గ్రామానికి చెందిన శ్రీనివాసులు తహసీల్దార్‌గా, ఆర్డీవోగా, స్పెషల్ కలెక్టర్‌గా పనిచేశారు. గతేడాది జిల్లాకు రెవెన్యూ అధికారిగా బదిలీపై వచ్చారు. ప్రస్తుతం ఆయనకు ఐఏఎస్ కేడర్ రావడంతో పలువురు ఉద్యోగులు అభినందనలు తెలిపారు.