పిరికిదాన్ని కాదు, ఫైటర్‌ని: మమతా బెనర్జీ

ABN , First Publish Date - 2022-03-03T23:02:04+05:30 IST

నాపై అనేక దాడులు జరిగాయి. కాల్పులు జరిగాయి. కర్రలతో కొట్టారు. కానీ నెనెప్పుడూ ఎవరి ముందు లొంగిపోలేదు. ఎందుకంటే నేను ఫైటర్‌ని. పిరికిదాన్ని కాదు. నేను వారణాసి రాగానే బీజేపీ కార్యకర్తలు నాపై దాడికి ప్రయత్నించారు..

పిరికిదాన్ని కాదు, ఫైటర్‌ని: మమతా బెనర్జీ

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ అధికారం కోల్పోతోందని, దీనికి తనపై జరిగిన ఆ పార్టీ కార్యకర్తల దాడే సాక్ష్యమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ అన్నారు. సమాజ్‌వాదీ పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహింంచేందుకు ఆమె బుధవారం వారణాసికి వచ్చారు. అయితే మమత రాకను వ్యతిరేకిస్తూ రైట్ వింగ్‌ గ్రూపులకు చెందిన కొంతమంది ఆందోళన నిర్వహించారు. మమతాను అడ్డుకునే ప్రయత్నం చేశారు.


వారణాసిలో గురువారం అఖిలేష్‌కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలు తనపై దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. ‘‘నాపై అనేక దాడులు జరిగాయి. కాల్పులు జరిగాయి. కర్రలతో కొట్టారు. కానీ నెనెప్పుడూ ఎవరి ముందు లొంగిపోలేదు. ఎందుకంటే నేను ఫైటర్‌ని. పిరికిదాన్ని కాదు. నేను వారణాసి రాగానే బీజేపీ కార్యకర్తలు నాపై దాడికి ప్రయత్నించారు. అంటే ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతోందని స్పష్టమవుతోంది’’ అని అన్నారు.


ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కావడానికి ముందు అఖిలేష్‌కు మద్దతుగా రెండు సభల్లో మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఇక పశ్చిమ బెంగాల్‌ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు బుధవారం విడుదతల అయ్యాయి. ఈ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించింది. ఈ ఫలితాలు తుది దశలో ఉన్నప్పుడే మమతా యూపీకి వెళ్లారు. బెంగాల్‌లో బీజేపీని అడ్డుకున్నామని, యూపీలో కూడా అడ్డుకుంటామని కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎక్కేముందు మమతా బెనర్జీ అన్నారు.

Updated Date - 2022-03-03T23:02:04+05:30 IST