ఫిట్‌నెస్‌పైనే దృష్టి పెట్టా.. సెలెక్షన్ నా చేతుల్లో లేదు: ధవన్

ABN , First Publish Date - 2020-05-16T00:09:40+05:30 IST

భారత స్టార్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధవన్ గాయం కారణంగా ప్రపంచకప్‌ నుంచి వెనుదిరిగిన విషయం...

ఫిట్‌నెస్‌పైనే దృష్టి పెట్టా.. సెలెక్షన్ నా చేతుల్లో లేదు: ధవన్

న్యూడిల్లీ: భారత స్టార్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధవన్ గాయం కారణంగా ప్రపంచకప్‌ నుంచి వెనుదిరిగిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కోలుకున్న ధవన్‌తో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌తో ఇన్‌స్టాగ్రాం లైవ్ సెషన్‌ నిర్వహించాడు. అందులో మాట్లాడిన ధవన్.. ఆటగాళ్లంతా అద్భుతంగా ఆడుతున్నారని, ఇది జట్టుకు ఎంతో కలిసొచ్చే అంశమని ధవన్ అన్నాడు. గాయం నుంచి కోలుకున్నాక ఫిట్‌నెస్‌పై మరింత ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు ధవన్ చెప్పాడు. అయితే జట్టు ఎంపిక తన చేతుల్లో ఉండదని, అది సెలెక్షన్ కమిటీ నిర్ణయిస్తుందని, దానిపై తానేమీ చెప్పలేనని అన్నాడు.


తన దృష్టంతా టీ20 ప్రపంచకప్‌పైనే ఉందని, దానికి ఎంపికవ్వడమే లక్ష్యంగా కృషి చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడుతున్నాడని కితాబిచ్చాడు. ఇదిలా ఉంటే రోహిత్‌-ధవన్‌లకు బెస్ట్ ఓపెనింగ్ జోడీగా పేరుంది. అయితే ప్రపంచకప్‌లో గాయం కారణంగా వెనుదిరగడంతో కేఎల్ రాహుల్ ఓపెనర్ స్థానాన్ని ఆక్రమించి సత్తా చాటుతున్నాడు.

Updated Date - 2020-05-16T00:09:40+05:30 IST