Abn logo
Jul 20 2021 @ 06:59AM

chittoor : ‘నేను బతికే ఉన్నాను.. ఆ కారణంగానే ఇలా...!’

చిత్తూరు : తాను బతికుండగానే ఆన్‌లైన్‌లో చనిపోయినట్లు నమోదు చేశారని బంగారుపాళ్యం మండలం శేషాపురానికి చెందిన లావణ్య ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ.. తాను పేదరాలినని.. రేషన్‌ కార్డు, జగనన్న కాలనీ ఇల్లు కోసం సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. అయితే తాను మరణించినట్లుగా ఆన్‌లైన్‌లో నమోదై ఉందని అక్కడి సిబ్బంది చెబుతున్నారన్నారు. వలంటీర్‌కు తమకు మనస్పర్థలు ఉన్నాయని.. ఈ కారణంగానే ఇలాచేసి ఉంటారని ఆరోపించారు. ఆరు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఉన్నతాధికారులైనా న్యాయం చేయాలని కోరారు.