ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో సత్తా చాటుతున్న మహిళలు!

ABN , First Publish Date - 2020-09-20T09:09:04+05:30 IST

ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో గుంజన్ సక్సేనా అనే సినిమా విడుదలైంది.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో సత్తా చాటుతున్న మహిళలు!

న్యూఢిల్లీ: ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో గుంజన్ సక్సేనా అనే సినిమా విడుదలైంది. గుంజన్ సక్సేనా ఎవరంటే.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌(ఐఏఎఫ్) నుంచి యుద్దంలో పొల్గొన్న మొట్టిమొదటి మహిళా ఆఫీసర్. 1994లో ఆమె ఐఏఎఫ్‌లో చేరారు. ఐఏఎఫ్ శిక్షణకు ఎంపికైన మహిళ ఆమె ఒక్కరే కావడంతో.. శిక్షణలో ఆమె ఎదుర్కొన్న సమస్యలను గుంజన్ సక్సేనా చిత్రంలో చూపించడం జరిగింది. ఎన్నో ఒడిదుడుకుడులను ఎదుర్కొని ఆమె ఐఏఎఫ్‌లో మహిళా ఆఫీసర్ అయ్యారు. ఇక 1999లో జరిగిన కార్గిల్ యుద్దంలో గుంజన్ సక్సేనా పాల్గొన్నారు. కార్గిల్ యుద్దంలో పాల్గొన్న ఏకైన మహిళా ఆఫీసర్‌గా ఆమె చరిత్ర స‌ృష్టించారు.


ఇప్పుడిదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ప్రస్తుతం ఐఏఎఫ్‌లో మహిళా ఆఫీసర్లు మగవారితో సమానంగా రాణిస్తున్నారు. ఐఏఎఫ్‌లో ఇప్పుడు మొత్తంగా 1,875 మంది మహిళా ఆఫీసర్లు ఉన్నట్టు రక్షణ మంత్రి శ్రీపద్ నాయక్ తాజాగా తెలిపారు. వీరిలో 10 మంది ఫైటర్ పైలట్లుగా, 18 మంది నావిగేటర్లుగా రాణిస్తున్నట్టు పేర్కొన్నారు. రక్షణశాఖ అప్రూవల్ తరువాత.. 2016 నుంచి ఇప్పటివరకు 10 మంది మహిళా ఆఫీసర్లను ఫైటర్ స్ట్రీమ్‌లోకి తీసుకున్నట్టు శ్రీపద్ నాయక్ చెప్పారు. వ్యూహాత్మక అవసరాలకు అనుగుణంగా మహిళా ఆఫీసర్లను ఐఏఎఫ్‌లో నియమించినట్టు ఆయన తెలిపారు. 

Updated Date - 2020-09-20T09:09:04+05:30 IST