Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 9 2021 @ 09:40AM

కూనూర్ హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని పరిశీలించిన IAF chief Air Chief Marshal

కూనూర్ (తమిళనాడు): ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి, తమిళనాడు డీజీపీ సి శైలేంద్రబాబులు గురువారం ఉదయం ఆర్మీ హెలికాప్టర్ కూలిన ప్రాంతమైన కూనూర్ ను సందర్శించారు.నీలగిరి జిల్లా కూనూరులో హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని వారు పరిశీలించారు.హెలికాప్టర్ ఎలా కూలిందనే విషయంపై ఎయిర్ మార్షల్ ఆరా తీశారు. సైన్యం ఆధీనంలో ఉన్న ఘటనా స్థలంలో కలియ తిరిగిన ఎయిర్ మార్షల్ ప్రత్యక్ష సాక్షులు, వాయుసేన అధికారులతో మాట్లాడారు.  త్రివిధ దళాల చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ తోపాటు 13మంది హెలికాప్టర్ ప్రమాద ఘటనలో మరణించిన నేపథ్యంలో గురువారం డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో జరగాల్సిన కమాండెంట్ల పరేడ్ ను రద్దు చేశారు. 


Advertisement
Advertisement