సిరియా అధ్యక్షుడిని చంపించాలని అప్పుడే అనుకున్నాను: ట్రంప్

ABN , First Publish Date - 2020-09-17T01:02:44+05:30 IST

రియా అధ్యక్షుడు బషర్‍ అల్‍ అసద్‍ను చంపడానికి 2017 లోనే తాను ఆదేశాలివ్వాలనుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ వెల్లడించారు. ఇందుకు ఏర్పాట్లు కూడా చేసినట్లు చెప్పారు.

సిరియా అధ్యక్షుడిని చంపించాలని అప్పుడే అనుకున్నాను: ట్రంప్

వాషింగ్టన్ : సిరియా అధ్యక్షుడు బషర్‍ అల్‍ అసద్‍ను చంపడానికి 2017 లోనే తాను ఆదేశాలివ్వాలనుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ వెల్లడించారు. ఇందుకు ఏర్పాట్లు కూడా చేసినట్లు చెప్పారు.


అయితే నాటి రక్షణ మంత్రి జేమ్స్ మ్యాటిస్‍ తనను వారించారని పేర్కొన్నారు. సొంత పౌరుల ఊచకోతకు, విదేశీయుల చిత్రవధకు ఆదేశాలివ్వడం వంటి యుద్ధ నేరాలకు అసద్‍ పాల్పడినట్లు ట్రంప్ ఈ సందర్భంగా ఆరోపించారు.


కాగా... మ్యాటిస్‍పై కూడా... ట్రంప్‍ విమర్శలు చేయడం గమనార్హం. విజయం ఎలా సాధించాలో ఆయనకు తెలియదని ఆక్షూేపించారు. మ్యాటిస్‍ వైదొలిగాక ఉగ్రవాదంపై పోరులో తాము ఎంతో పురోగతి సాధించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-17T01:02:44+05:30 IST