బాధ్యతగా పని చేస్తా

ABN , First Publish Date - 2020-11-28T05:23:27+05:30 IST

రాయలసీమ యూనివర్సిటీ అభివృద్ధికి బాధ్యతగా పని చేస్తానని ఉపకులపతి ఎ. ఆనందరావు అన్నారు.

బాధ్యతగా పని చేస్తా

  1. ఆర్‌యూ వీసీ ఆనందరావు 


కర్నూలు(అర్బన్‌), నవంబరు 27: రాయలసీమ యూనివర్సిటీ అభివృద్ధికి బాధ్యతగా పని చేస్తానని ఉపకులపతి ఎ. ఆనందరావు అన్నారు. శుక్ర వారం రాయలసీమ యూనివర్సిటీ నూతన ఉపకులపతిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీలో అవినీతి రహిత పాలన, బయోమెట్రిక్‌, తరగతుల నిర్వహణ తదితర అంశాలపై దృష్టి సారిస్తానన్నారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి, యూనివర్సిటీలో మంచి వాతావరణం కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు.

Updated Date - 2020-11-28T05:23:27+05:30 IST