నా క్యాడర్‌ జోలికొస్తే సహించను

ABN , First Publish Date - 2021-04-19T04:34:32+05:30 IST

పోలీస్‌ స్టేషన్‌ను అడ్డాగా మార్చిన అధి కారులు తమ క్యాడర్‌పై అక్రమ కేసులు బనాయిస్తే స హించేది లేదని ప్రభుత్వ విప్‌ కూచకుళ్ల దామో దర్‌రెడ్డి హెచ్చరించారు.

నా క్యాడర్‌ జోలికొస్తే సహించను
సమావేశంలో మాట్లాడుతున్న కూచకుళ్ల దామోదర్‌రెడ్డి

- ప్రభుత్వ విప్‌ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి


(నాగర్‌కర్నూల్‌-ఆంధ్రజ్యోతి) : పోలీస్‌ స్టేషన్‌ను అడ్డాగా మార్చిన అధి కారులు తమ క్యాడర్‌పై అక్రమ కేసులు బనాయిస్తే స హించేది లేదని ప్రభుత్వ విప్‌ కూచకుళ్ల దామో దర్‌రెడ్డి హెచ్చరించారు. పోలీసుల అక్రమాలతో టీఆర్‌ఎస్‌కు చెడ్డ పేరు వస్తోందని మండిపడ్డా రు. ఆదివారం సాయంత్రం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన వి లేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన టీఆర్‌ఎస్‌ నాయకుల ను ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మనుషులా, దా మోదర్‌రెడ్డికి చెందిన వారా అంటూ ప్రశ్నించి మరీ పనులు చేయడం దౌర్భాగ్యమన్నారు. శ్రీపు రం, పెద్దముద్దునూర్‌, మంతటి, శాయినాపల్లిలో తనను వెన్నంటే ఉండి టీఆ ర్‌ఎస్‌ అభ్యర్థి విజయం కోసం కృషి చేసిన క్యాడర్‌పై అక్రమంగా కేసులు బ నాయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. నాగర్‌కర్నూల్‌ సీఐ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, డీఎస్పీ కూడా ఉదాసీనంగా వ్యవహరిం చడంతో జవాబుదారీతనం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇంత అవినీతిమయమైన పోలీస్‌ స్టేషన్‌ను తాను ఎన్నడూ చూడలేదని అన్నారు. పోలీసులే రియల్‌ ఎస్టేట్‌ దందా నేరు గా చేసే పరిస్థితికి వచ్చారని, రియల్‌ మాఫియాను ప్రోత్సహిస్తూ నిజమైన భూ యాజమానులకు కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మన ఇసుక మన వాహనంతో నేరుగా ప్రయోజనం చేకూరే అవకాశం ఉన్నా, తమ అక్రమ ఆదాయాన్ని కోల్పోతామనే బాధతో రెవెన్యూ అధికారులపై ఒత్తి ళ్లు తీసుకొస్తున్నారని దామోదర్‌రెడ్డి ఆరోపించారు. త్వరలో తాను పార్టీ మా రబోతున్నానంటూ చేస్తున్న ప్రచారం వెనక పోలీస్‌ అధికారుల హస్తం ఉంద ని పేర్కొనడం గమనార్హం. రాజకీయాల్లో తాను అమ్ముడుపోయే సంస్కృతిని ఎన్నడూ అవలంభించలేదని, టీఆర్‌ఎస్‌ కోసమే పని చేస్తానని స్పష్టం చేశా రు. పోలీసుల వ్యవహార శైలిపై ఉన్నతాధికారులకు లిఖితపూ ర్వకమైన ఫిర్యా దు చేస్తానని కూచకుళ్ల దామోదర్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

Updated Date - 2021-04-19T04:34:32+05:30 IST