లైట్ ఆర్పను.. కొవ్వొత్తి వెలిగించను: అధిర్

ABN , First Publish Date - 2020-04-03T22:19:30+05:30 IST

కరోనా(కోవిడ్-19)తో పోరాటానికి లైట్లు ఆర్పేయడానికి సంబంధమేంటని ఆయన ప్రశ్నించారు. తాను లైట్ ఆర్పను.. కొవ్వొత్తి వెలిగించనని స్పష్టం చేశారు. ఇలా చేస్తే తనను దేశద్రోహి అంటారని, దానికి కూడా తాను సిద్ధమేనని ఆయన అన్నారు.

లైట్ ఆర్పను.. కొవ్వొత్తి వెలిగించను: అధిర్

న్యూఢిల్లీ: ఆదివారం రాత్రి 9 గంటలకు విద్యుత్ దీపాలను 9 నిమిషాల పాటు ఆర్పేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుపై లోక్‌సభా కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌధురి అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా(కోవిడ్-19)తో పోరాటానికి లైట్లు ఆర్పేయడానికి సంబంధమేంటని ఆయన ప్రశ్నించారు. తాను లైట్ ఆర్పను.. కొవ్వొత్తి వెలిగించనని స్పష్టం చేశారు. ఇలా చేస్తే తనను దేశద్రోహి అంటారని, దానికి కూడా తాను సిద్ధమేనని ఆయన అన్నారు.


‘‘లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగించడానికి కరోనాకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి మధ్య ఎలాంటి సబంధం లేదు. నేను లైట్లు ఆర్పేయను, కొవ్వొత్తులు వెలిగించను. కానీ కరోనాతో పోరాటం చేస్తూనే ఉంటాను. కొవ్వొత్తి వెలిగించకపోతే నన్ను కొందరు దేశద్రోహి అని పిలవొచ్చు. దానికి కూడా నేను సిద్ధపడే ఉన్నాను’’ అని అధిర్ రంజన్ అన్నారు.

Updated Date - 2020-04-03T22:19:30+05:30 IST