కేసీఆర్‌ నమ్మకాన్ని వమ్ము చేయను

ABN , First Publish Date - 2022-07-04T04:31:29+05:30 IST

టీఆర్‌ఎస్‌ అధిష్టానం నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమర్థవంతంగా బా ధ్యతలు నిర్వర్తిస్తానని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అధి కార ప్రతినిధి డాక్టర్‌ మందా జగన్నాథ్‌ అన్నారు.

కేసీఆర్‌ నమ్మకాన్ని వమ్ము చేయను
మందా జగన్నాథ్‌ను సన్మానిస్తున్న అలంపూరు టీఆర్‌ఎస్‌ నాయకులు

-  ఢిల్లీలో తెలంగాణ అధికార 

 ప్రతినిధి మందా జగన్నాథ్‌

- పలువురు సన్మానం

ఎర్రవల్లి చౌరస్తా, జూలై 3: టీఆర్‌ఎస్‌ అధిష్టానం నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అధి కార ప్రతినిధి డాక్టర్‌ మందా జగన్నాథ్‌ అన్నారు. ఆదివారం ఇటిక్యాల మండలంలోని కొండేరు గ్రామంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మందా జగన్నాథ్‌ మాట్లాడారు.  సీఎం కేసీఆర్‌ తనపై నమ్మకంతో కేబినెట్‌హోదా కలి గిన బాధ్యతల్లో నియమించారన్నారు. ప్రభుత్వ ప్రతినిధిగా తెలంగాణ రాష్ట్ర హక్కును కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా వ్యవహరిస్తూ నిధులు తీసుకోస్తానని పేర్కొన్నారు. కేసీఆర్‌ దేశ రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారని, జాతీయ పార్టీగా మారుతున్న తరుణంలో తనకు ఈ అవకాశాన్ని ఇచ్చారన్నారు. దేశంలోని గుణాత్మక మార్పుకు కేసీఆర్‌ యోచిస్తున్నారని, లౌకికవాద రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పోరాడి సాధించుకున్నామో అదే స్ఫూర్తితో  దేశ రాజకీయాల్లో తమ పాత్రను సముచిత స్థానంలో నిలుపుతామని ఉద్ఘాటించారు.  కేంద్రంలోని బీజేపీ ప్ర భుత్వం మతవిద్వేషాలను రెచ్చగొట్టే  పనిలో ఉందని, ప్రజాస్వామ్య వ్యతిరేఖ విధానాలను అవలంబి స్తోందన్నారు. దేశ ప్రజలు గమనిస్తున్నారని, బుద్ధి చెప్పే కాలం సమీపంలోనే ఉందన్నారు. ఈ సంద ర్భంగా  ఆయన్ను ఆయా గ్రామాల సర్పంచులు, ని యోజకవర్గ స్థాయి నాయకులు  కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో  టీఆర్‌ఎస్‌ నాయకులు మందాశ్రీనాథ్‌, జోగుళాంబ అలయ కమిటీ చైర్మన్‌ శ్రీనివాసరెడ్డి, నాయకులు ఇస్మాయిల్‌, నతనియేల్‌, తేజ, మూగేన్న, అంజి పాల్గొన్నారు.

మందా జగన్నాథ్‌కు ఘన సన్మానం 

అలంపూరు : ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధిగా నియమితులైన నాగర్‌ కర్నూల్‌ మాజీ ఎంపీ  మందా జగన్నాథ్‌ను ఆది వారం అలంపూరు నాయకులు ఘనంగా సన్మానిం చారు.  ఇటిక్యాల మండలం కోండేరులోని మందా నివాసంలో నాయకులు సన్మానించి జోగుళాంబ, బాలబ్రహ్మేశస్వామి వారి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్‌ నారాయణ రెడ్డి, ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-04T04:31:29+05:30 IST