Advertisement
Advertisement
Abn logo
Advertisement

సమస్యలపై న్యాయస్థానాలను ఆశ్రయించొచ్చు

ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి అరుణశ్రీ


చోడవరం, డిసెంబరు 4: దివ్యాంగులు తమ హక్కుల సాధనకు అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించి తగిన న్యాయం పొందవచ్చని స్థానిక ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌.అరుణశ్రీ చెప్పారు. మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శనివారం దివ్యాంగులతో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో జడ్జి మాట్లాడారు. దివ్యాంగులకు చట్టంలో సంపూర్ణంగా రక్షణ ఉందన్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలిగినా, హక్కులకు భంగం వాటిల్లినా న్యాయస్థానం అండగా ఉంటుందని చెప్పారు. దివ్యాంగులు ఎవరికీ ఎందులోనూ తక్కువకారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అటవీ శాఖ రేంజి అధికారి బి.రాంనరేశ్‌, ఆర్క్‌ సంస్థ కార్యదర్శి డీఎస్‌ ప్రసాద్‌, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు దుగ్గిరా రవికుమార్‌, దివ్యాంగులు పాల్గొన్నారు.  


Advertisement
Advertisement