రెస్ట్‌రూమ్‌కు వెళ్లి.. షాక్‌కు గురైన మహిళ.. అసలేం జరిగిందంటే!

ABN , First Publish Date - 2020-08-10T03:53:00+05:30 IST

అమెరికాలోని ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. రెస్ట్‌రూంలోకి వెళ్లిన ఆమెకు.. పాము కనిపించడంతో షాక్‌కు గురైంది. వివరాల్లోకి వెళితే.. కొలరాడోకు చెం

రెస్ట్‌రూమ్‌కు వెళ్లి.. షాక్‌కు గురైన మహిళ.. అసలేం జరిగిందంటే!

వాషింగ్టన్: అమెరికాలోని ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. రెస్ట్‌రూంలోకి వెళ్లిన ఆమెకు.. పాము కనిపించడంతో షాక్‌కు గురైంది. వివరాల్లోకి వెళితే.. కొలరాడోకు చెందిన మిరాండా స్టీవార్ట్.. బాత్రూమ్‌కు వెళ్లగానే.. అక్కడ ఆమెకు ఏదో శబ్ధం వినిపించింది. ఏంటాని చుట్టుపక్కల గమనించిన ఆమెకు.. టాయిలెట్ సీట్‌లో ఓ పాము కనిపించింది. దీంతో మిరాండా స్టీవార్ట్‌కు గుండె ఆగినంత పనైంది. అనంతరం షాక్‌ నుంచి తేరుకున్న ఆమె.. జరిగిన విషయాన్ని తన బాయ్‌ఫ్రెండ్‌కు చెప్పింది. అంతేకాకుండా టాయిలెట్ సీటు నుంచి పామును తీయడానికి.. అపార్ట్‌మెంట్‌లో పని చేసే వ్యక్తిని పిలుచుకుని రమ్మని సలహా ఇచ్చింది. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న అపార్ట్‌మెంట్ సిబ్బంది.. టాయిలెట్ సీటు నుంచి చాకచక్యంగా పామును బయటికి తీశారు. దీంతో మిరాండా స్టీవార్ట్.. ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. ఆ పాముకు సంబంధించిన ఫొటోలను తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఆమె.. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. రెస్ట్‌రూంమ్‌లో పాము కనిపించే సరికి.. భయాందోళనలకు గురైనట్లు ఫేస్‌బుక్‌లో ఆమె రాసుకొచ్చారు. దీంతో ఆమె పోస్ట్ చేసిన పాము ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


Updated Date - 2020-08-10T03:53:00+05:30 IST