యాక్సిడెంట్ నేను చేయలేదు: మాట మార్చిన కేంద్ర మంత్రి కుమారుడు

ABN , First Publish Date - 2021-10-04T23:51:15+05:30 IST

మా పూర్వీకులకు సంబంధించిన ఓ కార్యక్రమం ఉంది. 35 ఏళ్లుగా క్రమం తప్పకుండా ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఈసారి నిర్వహించే కార్యక్రమం కోసం ఉప ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఆయనను స్వాగతించడానికి కాన్వాయ్‌ని పంపించాం. ఇందులో రెండు కార్లు ఉన్నాయి...

యాక్సిడెంట్ నేను చేయలేదు: మాట మార్చిన కేంద్ర మంత్రి కుమారుడు

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌లో రైతులపై నుంచి కారును ఉరికించి నలుగురి ప్రాణాలు పోవడానికి కారణమైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా మాట మార్చారు. ప్రమాదానికి కారణమైన కారులో తాను లేనని, తాను తన తల్లిదండ్రుల ఇంట్లో ఉన్నానని ఆయన తెలిపారు. వాస్తవానికి తన పూర్వీకులకు సంబంధించిన కార్యక్రమాలు ఉంటే ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి ఎదురెళ్లడానికి కాన్వాయ్ పంపించామని, అందుకే తాను ఆ కాన్వాయ్‌లో ఉన్నానని అనుకుంటున్నారని ఆశిష్ పేర్కొన్నారు.


సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా పూర్వీకులకు సంబంధించిన ఓ కార్యక్రమం ఉంది. 35 ఏళ్లుగా క్రమం తప్పకుండా ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఈసారి నిర్వహించే కార్యక్రమం కోసం ఉప ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఆయనను స్వాగతించడానికి కాన్వాయ్‌ని పంపించాం. ఇందులో రెండు కార్లు ఉన్నాయి. ఒకటి మహింద్ర థార్, ఇంకొకటి టోయోటా ఫార్చూనర్, అయితే ఇందులో అక్కడ ఇంకొక చిన్నకారు కూడా ఉంది’’ అని అన్నారు.


‘‘అందరూ అనుకుంటున్నట్టుగా నేను ఆ కారులో లేను. నేను బన్విపూర్‌లోని మా తల్లిదండ్రుల ఇంట్లో ఉన్నాను. అక్కడే రెజ్లింగ్ మ్యాచ్ నిర్వహిస్తున్నాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉన్నాను. ఫార్చూనర్ అలా రైతులపైకి వెళ్లడం కరెక్ట్ కాదు. ముందు వెళ్తున్న కారుపై రాళ్లు, కర్రలతో కొంత మంది దాడికి పాల్పడ్డారు. డ్రైవర్ హరి ఓం తీవ్రంగా గాయడ్డారు. అదే సమయంలో కారు అదుపుతప్పి రైతులపైకి దూసుకెళ్లింది’’ అని ఆశిష్ మిశ్రా చెప్పుకొచ్చారు.

Updated Date - 2021-10-04T23:51:15+05:30 IST