రెండు భాషల సిద్ధాంతం నాపై దుష్ప్రభావం చూపింది : అన్నా యూనివర్సిటీ మాజీ వీసీ

ABN , First Publish Date - 2020-08-10T02:00:18+05:30 IST

హిందీ వంటి అత్యధికులు మాట్లాడే భాషను నేర్చుకుంటే యువతకు అనేక ప్రయోజనాలు

రెండు భాషల సిద్ధాంతం నాపై దుష్ప్రభావం చూపింది : అన్నా యూనివర్సిటీ మాజీ వీసీ

కోయంబత్తూరు : హిందీ వంటి అత్యధికులు మాట్లాడే భాషను నేర్చుకుంటే యువతకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయని అన్నా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ బాల గురుస్వామి అన్నారు. ఇటువంటి భాషలను నేర్చుకుంటే దేశభక్తి, జాతీయ సమైక్యత, సామరస్యం, సమైక్యత భావాలు పెరుగుతాయన్నారు. వ్యక్తిత్వం పరిపుష్టమవుతుందని చెప్పారు. ఉపాధి కోసం వివిధ రాష్ట్రాలకు వెళ్లే అవకాశం లభిస్తుందన్నారు. ప్రజలు, రాష్ట్రాల మధ్య సుహృద్భావం పెరుగుతుందన్నారు. కేంద్ర సివిల్, డిఫెన్స్ రంగాల్లో, బహుళ జాతి కంపెనీల్లో  చేరాలనుకునేవారికి ఉపయోగపడుతుందని చెప్పారు. 


విద్యార్థులు ఇతర భారతీయ భాషలు నేర్చుకోకుండా 50 ఏళ్ల నుంచి నిరాకరిస్తున్న రాష్ట్రం తమిళనాడు ఒక్కటేనన్నారు. రెండు భాషల సిద్దాంతం వల్ల నష్టపోయినవారిలో తాను కూడా ఒకడినని చెప్పారు. 


కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన జాతీయ విద్యా విధానం ఫలానా భాషను తప్పనిసరిగా నేర్చుకోవాలని చెప్పడం లేదని, అయినప్పటికీ ముఖ్యమంత్రి పళనిస్వామి తన ప్రభుత్వం రెండు భాషల సిద్దాంతానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించడం తనకు దిగ్భ్రాంతి కలిగించిందని చెప్పారు. 


Updated Date - 2020-08-10T02:00:18+05:30 IST