ముంబై: ఏక్‌నాథ్ షిండేకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి, తాను ఉప ముఖ్యమంత్రి పదవికి పరిమితం కావడంపై బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) మంగళవారంనాడు స్పందించారు. తానే రిక్వెస్ట్ చేసి ఉంటే ముఖ్యమంత్రిని అయి ఉండేవాడినని అన్నారు. సైద్ధాంతికపరంగానే తాము శివసేన నేతను ముఖ్యమంత్రిని చేశామని చెప్పారు. షిండేకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ప్రతిపాదన చేసింది కూడా తానేనని తెలిపారు.
ఇవి కూడా చదవండి
''నేను ప్రభుత్వంలో లేకుండా ఉండే ప్రభుత్వం నడవదని పార్టీ సీనియర్ నేతలు గట్టిగా పట్టుపట్టారు. వారి ఆదేశాలకు కట్టుబడే ఉప ముఖ్యమంత్రి పదవికి అంగీకరించాను" అని ఫడ్నివిస్ వెల్లడించారు. ఏక్‌నాథ్ షిండేను సక్సెస్‌ఫుల్ సీఎంగా నడిపించాల్సిన బాధ్యత తనపైన ఉందని చెప్పారు.