Abn logo
Feb 22 2020 @ 01:46AM

ఈ జర్నీని ప్రేమిస్తావు

తెలుగు తెరకు హీరోగా పరిచయమవుతున్న చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ను రామ్‌చరణ్‌ పరిశ్రమలోకి ఆహ్వానించారు. వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘ఉప్పెన’ సినిమా కొత్త పోస్టర్‌ను శుక్రవారం ఆయన సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. ‘‘బిగ్‌ వెల్‌కమ్‌ వైష్ణవ్‌ తేజ్‌! ఈ జర్నీని నువ్వు ప్రేమిస్తావు. పూర్తి స్థాయిలో దీన్ని ఆస్వాదించు. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’’ అని రాసుకొచ్చారు. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. కృతిశెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. 


Advertisement
Advertisement
Advertisement