`సర్వం కోల్పోయాను.. ఇంకేం మిగల్లేదు.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి`.. ఆ మహిళ ఆవేదన వింటే..

ABN , First Publish Date - 2022-05-04T18:10:54+05:30 IST

ఆ మహిళ తన భర్త, పిల్లలతో ఎంతో సంతోషంగా జీవితం గడుపుతోంది.. ఎలాంటి కష్టాలూ లేకుండా సుఖసంతోషాలతో జీవిస్తోంది..

`సర్వం కోల్పోయాను.. ఇంకేం మిగల్లేదు.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి`.. ఆ మహిళ ఆవేదన వింటే..

ఆ మహిళ తన భర్త, పిల్లలతో ఎంతో సంతోషంగా జీవితం గడుపుతోంది.. ఎలాంటి కష్టాలూ లేకుండా సుఖసంతోషాలతో జీవిస్తోంది.. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆమె జీవితం తల్లకిందులైంది.. కళ్ల ముందే భర్త, పిల్లలు చనిపోవడంతో ఆమె తీవ్ర విషాదంలో కూరుకుపోయింది.. మరో పది అడుగుల్లో తనను చేరుతారునుకున్న భర్త, పిల్లలు కారుతో సహా బావిలో పడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది.. ఇంకా కోల్పోయేందుకు తనకేం మిగల్లేదని తీవ్ర ఆవేదన చెందుతోంది.. ఆమె వేదన అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. 


మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాకు చెందిన ధనుంజయ్, మణి ప్రభ దంపతులకు ఇద్దరు పిల్లలు. ప్రతిరోజూ రాత్రి భోజనం తర్వాత పిల్లలను తీసుకుని కారులో బయటకు వెళ్లడం ధనుంజయ్, మణి ప్రభ దంపతులకు అలవాటు. ప్రతిరోజూ లాగానే గత శనివారం రాత్రి కూడా ధనుంజయ్ తన పిల్లలతో బయటకు వెళ్లాడు. అయితే ఆరోజు మణిప్రభ వారితో బయటకు వెళ్లలేదు. తిరిగి ఇంటికి వచ్చి కార్ పార్క్ చేసేందుకు ధనంజయ్ ప్రయత్నించాడు. రివర్స్ చేస్తూ కారుతో సహా ఇంటి బయట ఉన్న బావిలో పడిపోయాడు. ఆ బావి చుట్టూ రక్షణ కోసం గోడ లేదు. 


ఆ బావిలో నీరు లేకపోవడంతో ఎవరూ పట్టించుకోలేదు. బావి చుట్టా కర్రలు మాత్రమే కట్టి వదిలేశారు. ఆ కాలనీ వాళ్లు ఎన్ని సార్లు చెప్పినా మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోలేదు. శనివారం రాత్రి ఆ బావిలో కారు పడిపోవడంతో ధనుంజయ్, ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. పిల్లలను ఇంట్లోకి తీసుకెళ్లేందుకు బయటకు వచ్చిన మణిప్రభ ఆ దృశ్యం చూసి దిగ్భ్రాంతికి గురైంది. `నేను సర్వం కోల్పోయాను. ఇంకేం మిగల్లేదు. నా బాధను ఎవరూ తీర్చలేరు. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. నాకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తార`ని ఆమె ప్రశ్నిస్తోంది.  

Read more