ఆ విషయాన్ని సచిన్ నుంచి నేర్చుకున్నా: పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ప్రమోద్ భగత్

ABN , First Publish Date - 2021-09-13T00:45:35+05:30 IST

ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండడం ఎలానో తాను దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నుంచి నేర్చుకున్నానని పారాలింపిక్స్

ఆ విషయాన్ని సచిన్ నుంచి నేర్చుకున్నా: పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ప్రమోద్ భగత్

న్యూఢిల్లీ: ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండడం ఎలానో తాను దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నుంచి నేర్చుకున్నానని పారాలింపిక్స్ బ్యాడ్మింటన్ గోల్డ్ మెడలిస్ట్ ప్రమోద్ భగత్ పేర్కొన్నాడు. ప్రపంచ చాంపియన్ అయిన భగత్ గతవారం టోక్యోలో జరిగిన ఎస్ఎల్ 3 క్లాస్ ఫైనల్‌లో గ్రేట్ బ్రిటన్ ఆటగాడిని ఓడించడం ద్వారా పసిడి పతకం అందుకున్నాడు. 


33 ఏళ్ల భగత్ నాలుగేళ్ల వయసులో ఉండగా పోలియో బారినపడ్డాడు. ఫైనల్‌లో సెకండ్ గేమ్‌లో 8 పాయింట్లు వెనకబడినప్పటికీ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని విజయం సాధించి దేశానికి స్వర్ణ పతకం అందించాడు. ‘‘నేను చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని. దూరదర్శన్‌లో క్రికెట్ చూసేవాడిని. టెండూల్కర్ ప్రశాంతంగా కనిపించేవాడు. మైదానంలో అతడి ప్రవర్తన నన్ను ఆకట్టుకునేంది. అది నాపై తీవ్ర ప్రభావం చూపింది’’ అని భగత్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. 


ఆ తర్వాతి నుంచి అతడిని తాను అనుసరించేవాడినని, అతడి క్రీడా స్ఫూర్తి తనపై చాలా బాగా పనిచేసిందని భగత్ అన్నాడు. తాను ఆడడం ప్రారంభించిన తర్వాత సచిన్ పద్ధతినే పాటించేవాడనని పేర్కొన్నాడు. ప్రపంచ చాంపియన్‌షిప్ సహా ఎన్నో విజయాలకు అది కారణమైందని భగత్ వివరించాడు.  

Updated Date - 2021-09-13T00:45:35+05:30 IST