మోదీని పంజాబ్‌కి ఆహ్వానిస్తున్నా: పంజాబ్ సీఎం చన్నీ

ABN , First Publish Date - 2022-01-06T01:48:53+05:30 IST

ఢిల్లీకి మోదీ పయనమైన అనంతరం మీడియాతో చన్నీ మాట్లాడుతూ ‘‘ప్రధాని ఇలా వెళ్లిపోవడం చాలా బాధాకరం. మన ప్రధాని అంటే మాక్కూడా ఎంతగానో గౌరవం ఉంది. ప్రధాని ఈరోజే ఫిరోజ్‌పూర్ వచ్చి ఈరోజు నిర్వహించాల్సిన సభను ప్రారంభించాలని ప్రధాని మోదీని నేను కోరుతున్నాను’’ అని సీఎం చన్నీ అన్నారు...

మోదీని పంజాబ్‌కి ఆహ్వానిస్తున్నా: పంజాబ్ సీఎం చన్నీ

చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వస్తూ ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. అయితే ప్రధాని అలా వెనక్కి వెళ్లడం చాలా బాధాకరమని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ అన్నారు. పంజాబ్‌కు ప్రధాని మోదీ రావాలని, పంజాబ్‌లో ఎలాంటి భద్రతా సమస్య లేదని చన్నీ స్పష్టం చేశారు. ఈరోజు నిర్వహించాల్సిన సభకు ఇప్పటికైనా తిరిగి వచ్చి సభ నిర్వహించాలని కోరారు. మన దేశ ప్రధానిని తాము గౌరవిస్తామని చన్నీ పేర్కొన్నారు.


ఢిల్లీకి మోదీ పయనమైన అనంతరం మీడియాతో చన్నీ మాట్లాడుతూ ‘‘ప్రధాని ఇలా వెళ్లిపోవడం చాలా బాధాకరం. మన ప్రధాని అంటే మాక్కూడా ఎంతగానో గౌరవం ఉంది. ప్రధాని ఈరోజే ఫిరోజ్‌పూర్ వచ్చి ఈరోజు నిర్వహించాల్సిన సభను ప్రారంభించాలని ప్రధాని మోదీని నేను కోరుతున్నాను’’ అని సీఎం చన్నీ అన్నారు.


అయితే తన కాన్వాయ్‌ని నిరసనకారులు అడ్డుకోవడంతో తిరిగి ఢిల్లీకి ప్రయాణం అవుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ''ప్రాణాలతో బటిండా విమానాశ్రయానికి చేరుకున్నా. మీ ముఖ్యమంత్రికి థాంక్స్'' అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా అధికారులతో అన్నట్టు ఏఎన్ఐ వార్తాసంస్థ ట్వీట్ చేసింది. అయితే బీజేపీ నిర్వహించిన సభకు ప్రజల ఆదరణ లేనందువల్లే ప్రధాని మోదీ తన సభను రద్దు చేసుకున్నారని, అది బయటికి చెప్పలేక తమపై నిందలు మోపుతున్నారని పంజాబ్ సీఎం చన్నీ ఘాటుగా స్పందించారు.

Updated Date - 2022-01-06T01:48:53+05:30 IST