RCB కీలక నిర్ణయం.. Siraj ఇకపై బెంచ్‌కే పరిమితం?

ABN , First Publish Date - 2022-05-06T01:32:24+05:30 IST

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేసర్ Mohammed Siraj ఇకపై బెంచ్‌కే పరిమితం కానున్నాడా? ఈ ప్రశ్నకు

RCB కీలక నిర్ణయం.. Siraj ఇకపై బెంచ్‌కే పరిమితం?

ముంబై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేసర్ Mohammed Siraj ఇకపై బెంచ్‌కే పరిమితం కానున్నాడా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. బుధవారం చెన్నైతో మ్యాచ్ ప్రారంభానికి ముందు సిరాజ్ ఓ చానల్‌తో మాట్లాడుతూ.. జట్టు అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. పవర్‌ప్లేలో వికెట్లు తీయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, దీనిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చాడు. సిరాజ్ చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం.


ఈ సీజన్‌లో సిరాజ్ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్నాడు. సిరాజ్ ఇప్పటి వరకు 9.04 ఎకానమీ రేట్‌తో నాలుగు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు పవర్ ప్లేలో 100 బంతులు వేసిన 9 మంది బౌలర్లలో అత్యంత చెత్త రికార్డు సిరాజ్‌దే. గత సీజన్‌లో మాత్రం 6.44 ఎకానమీతో బెస్ట్ బౌలర్‌గా నిలవడం గమనార్హం. 


RCBలో ప్రస్తుతం జోష్ హేజిల్‌వుడ్, షాబాజ్ అహ్మద్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌తోపాటు రిజర్వులో ఉన్న చామా మిలింద్ వంటి ఉత్తేజకరమైన బౌలర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో సిరాజ్‌ను బెంచ్‌కు పరిమితం చేసి రిజర్వు ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని ఆర్సీబీ భావిస్తోంది. మిడిల్ ఓవర్లతోపాటు డెత్ ఓవర్లలోనూ సిరాజ్ ప్రభావం చూపించలేకపోతుండడంతో అతడిని బెంచ్‌కు పరిమితం చేయాలని ఆర్సీబీ దాదాపు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Read more