Abn logo
May 21 2020 @ 16:23PM

నాన్నను చూసి 4 నెలలయింది: గాయకుని కుమార్తె

ముంబై: కరోనా ఎన్నో కుటుంబాలను చెల్లాచెదురు చేసింది. తండ్రికి బిడ్డలను, భర్తకు భార్యను, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో. నిరుపేదలే కాదు సెలబ్రిటీలు కూడా దీనికి అతీతులేమీ కాదు. ఇటీవల బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ రెండు నెలలపాటు తల్లిదండ్రులకు దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ గాయకుడు కుమార్ సానూ కుమార్తె షానోన్ కూడా తన తండ్రిపై బెంగ పెట్టుకున్నారు. ‘నాన్నను చూసి 4 నెలలైంది. ఆయనను చాలా మిస్ అవుతున్నాను’ ఆంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మ, సోదరిలతో కలిసి అమెరికాలో తాను నివసిస్తున్నానని, అయితే ఏప్రిల్‌లో నాన్నను చూసేందుకు రావాలనుకున్నానని, కరోనా లాక్‌డౌన్ కారణంగా కుదరలేదని పేర్కొన్నారు. త్వరగా పరిస్థితులు చక్కబడితే ఆయనను కలుసుకోవాలని ఉందని తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement