ఎప్పుడు.. ఏ ‘రత్నం’ ఊడుతుందో తెలీదు: రఘురామ

ABN , First Publish Date - 2021-09-11T20:55:37+05:30 IST

ఢిల్లీ: సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలన్నీ త్వరలోనే.. నవ రంధ్రాలవుతాయని ఎంపీ రఘురామకృష్ణమరాజు ఎద్దేవాచేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవరత్నాలలో ఎప్పుడు..

ఎప్పుడు.. ఏ ‘రత్నం’ ఊడుతుందో తెలీదు: రఘురామ

ఢిల్లీ: సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలన్నీ త్వరలోనే.. నవ రంధ్రాలవుతాయని ఎంపీ రఘురామకృష్ణమరాజు ఎద్దేవాచేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవరత్నాలలో ఎప్పుడు.. ఏ రత్నం ఊడుతుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. పింఛన్లను ఎలా తొలగించాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాలు ఉన్నది పరిపాలన చేయడానికే కానీ.. వ్యాపారాలు చేయడానికి కాదని హితవుపలికారు.


ఆటో డైవర్స్‌కు వాహన మిత్ర కింద వాహనాలు ఇస్తున్నారే గానీ.. చమురు ధరలపై  టాక్స్‌లు, దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిపై పట్టించుకోవడం లేదన్నారు. దీంతో డ్రైవర్లకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని చెప్పారు. ఏపీ ఫైబర్‌గ్రిడ్ లిమిటెడ్ ఎంఎస్‌వో లైసెన్స్‌ను అనధికారికంగా, అక్రమంగా ఉపయోగించడంపై కేంద్ర ఐటీ శాఖకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.


తెలంగాణలో వినాయకచవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకొన్నారని.. ఉత్సవాలలో తెలంగాణ గవర్నర్ సైతం పాల్గొన్నారని గుర్తుచేశారు. అయితే ఏపీలో జరిగిన ఉత్సవాల్లో గవర్నర్ కనిపించకపోవడం దురదృష్టకరమని తెలిపారు. ఆదివారం చర్చిల్లో ప్రార్థనలపై ఎలాంటి నియంత్రణా లేదన్నారు. చవితి వేడుకల్లో ఐదుగురికి మించి ఉండకూడదన్న నిబంధన.. చర్చిలకు కుడా అమలు చేస్తారా.. అని ప్రశ్నించారు. చర్చిల్లో ఏ నిబంధనలూ లేనట్లే.. హిందువులు కూడా పూజలు చేసుకునేలా చూడాలని సూచించారు. ధూపదీప నైవేద్యాలకు రూ.234 కోట్లు ఇస్తామని.. ఒక్క పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. హిందూ ఆలయాల మీద పడి నాశనం చేయొద్దని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-09-11T20:55:37+05:30 IST