Abn logo
Sep 25 2020 @ 01:39AM

ఆ మొగుడు వద్దు బాబోయ్‌

Kaakateeya

పెళ్లి అయి పట్టుమని రెండువారాలు కూడా కాలేదు అప్పుడే భర్త వేధిస్తున్నాడంటూ రోడ్డెక్కారు బాలీవుడ్‌  హాట్‌ బ్యూటీ పూనమ్‌ పాండే. స్నేహితుడైన సామ్‌ బాంబేను గాఢంగా ప్రేమించిన పూనమ్‌ ఇటీవల పెళ్లి చేసుకున్నారు. ఓ సినిమా షూటింగ్‌ కోసం గోవా వెళ్లిన పూనమ్‌ తన భర్త వేధిస్తున్నాడని, శారీరక దాడికి పాల్పడుతున్నాడని సామ్‌పై గోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సామ్‌ బాంబేను గోవా పోలీసులు ఈ నెల 22న అరెస్టు చేశారు. మరుసటి రోజే బాంబేకు గోవా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ‘‘సామ్‌తో  రిలేషన్‌ ఎప్పుడూ హింసాత్మకంగానే ఉండేది. పెళ్లి చేసుకుంటే అతనిలో మార్పు వస్తుందని భావించాను. నాపై ఆధిపత్యం చలాయించడమే కాకుండా చిన్న విషయాలకే ఆవేశపడుతుంటాడు. గోవాలో చిన్న విషయంలో ఇద్దరికీ వాదన మొదలైంది. దాంతో నన్ను కొట్టడం మొదలుపెట్టాడు. ముఖంపై పిడికిలితో గుద్దాడు.  జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ లాక్కెళ్లి తలను మంచం మూలకేసి కొట్టాడు. ఆ సమయంలో ప్రాణం పోయిందేమో అనుకున్నా. ఏదోలా బయటపడ్డా. హోటల్‌ సిబ్బంది సహాయంతో పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. జంతువులా ప్రవర్తించిన ఆ మొగుడు వద్దు బాబోయ్‌. మా ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నించాను. కాని ఇలాంటి వ్యక్తితో ఉండడం కంటే ఒంటరిగా ఉండడం మేలు’’ అని పూనమ్‌ తెలిపారు. 

Advertisement
Advertisement