Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 31 Mar 2022 15:53:27 IST

నాకు మంత్రి కావాలని లేదు: జగ్గారెడ్డి

twitter-iconwatsapp-iconfb-icon
నాకు మంత్రి కావాలని లేదు: జగ్గారెడ్డి

సంగారెడ్డి: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి కావాలని లేదని ఆయన అన్నారు.  సంగారెడ్డిలో పాస్టర్స్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చి పదవి ఇస్తానన్నా తాను తీసుకోనన్నారు. తాను గెలుపు.. ఓటమిని ఒకేలా చూస్తానని ఆయన స్పష్టం చేశారు. కొన్నిసార్లు ఓటమి కూడా మేలు అనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. తనది డిఫరెంట్ మైండ్, డిఫరెంట్ క్యారెక్టర్ అని ఆయన పేర్కొన్నారు. 


తాను ముగ్గురు సీఎంలు రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో పరిపాలనా విధానంలో, రాజకీయంగా వ్యూహాల్లో భాగస్వామ్యం ఉందని అందుకనే తనకు పవర్ మీద పెద్ద ఆసక్తి లేదన్నారు. తాను గెలుపుని, ఓటమిని ఒకేలా చూస్తానన్నారు. అధికారం ఉన్నపుడు అన్నీ తెలుస్తాయని అనుకుంటామని, కానీ అధికారంలో ఉంటే కొన్నే తెలుస్తాయన్నారు. కొన్నిసార్లు అధికారం లేకపోతే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయని ఆయన అన్నారు. ఎన్నికలలో గెలుపు, ఓటములు సహజమన్నారు. గెలుపు ప్రజాసేవకు ఉపయోగపడుతుందని, ఓటమి అనుభవానికి ఉపయోగపడుతుందని అయన  వేదాంతం పలికారు. ఈ రెండూ ప్రతీ నాయకుడికి అవసరమని ఆయన పేర్కొన్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.