Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 17 Jan 2022 03:03:33 IST

ఆ బెగ్గింగ్‌ యాటిట్యూడ్‌ అర్థం కావట్లేదు!

twitter-iconwatsapp-iconfb-icon
ఆ బెగ్గింగ్‌ యాటిట్యూడ్‌ అర్థం కావట్లేదు!

వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన వర్మ ‘ట్వీటు’లతోనే క్రేజ్‌ సంపాదించుకుంటున్నారు. ఏ విషయం ఎలా సెన్షేషన్‌ చేయాలో ఆయనకి తెల్సినంత ట్రిక్‌ మరెవరికీ తెలీదు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసిన విశేషాలతో పాటు ఇండస్ర్టీ తీరునూ, లైఫ్‌ స్టయిల్‌నూ పంచుకున్నారిలా.. ఆ విశేషాలివే!


ఆర్కే: వర్మగారూ.. ఏంటి రంగు రంగుల బూట్లు.. మంచి కౌబాయ్‌లా తయారయ్యారు?

వర్మ: (నవ్వులు).. బేసిక్‌గా రియలైజ్‌ అయినదేంటంటే.. ఈ రంగు రంగుల బట్టలేసుకుని.. యంగ్‌ పీపుల్స్‌ను పక్కన పెట్టుకుని పని చేస్తుంటే ఇంకా యంగ్‌గా ఉన్నా అనిపిస్తుంది. 


ఆర్కే: ఏంటీ యంగ్‌ పీపులా? గాళ్సా?

వర్మ: రెండూ. యంగ్‌గా ఉంటాననే అపోహ కలిగేట్లు   ఇలా చిన్న సైకలాజికల్‌ ట్రిక్‌ ప్రయోగిస్తున్నా.


ఆర్కే: భావించటమే! అంతేగానీ యంగ్‌ కాదు

వర్మ: అఫ్‌ కోర్స్‌. నేనక్కడి యంగ్‌ (నవ్వులు). 


ఆర్కే: ఆడపిల్లలతో డ్యాన్సులేసే వీడియోలను అప్పుడప్పుడు వదులుతుంటారు. చిత్ర విన్యాసాలు చేస్తూంటారు?

వర్మ: వయసు పెరిగే కొలదీ జ్ఞానం పెరుగుతోంది. దేన్నీ అంత సీరియ్‌సగా తీసుకోవాల్సిన అవసరం లేదు. బతికినన్నాళ్లు శుభ్రంగా హ్యాపీగా బతకాలి. ఇష్టమొచ్చినట్లు ఉండాలి. ఎవరినీ కేర్‌ చేయకూడదనే జ్ఞానం లేట్‌గా వెలిగింది. అందుకని ఈ మధ్యన ఇలా ఉన్నా. బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానం అయినట్లు బార్‌లో నాకు జరిగింది.


ఆర్కే:  మూడు పెగ్గులూ ఆరు మంది అమ్మాయిలా? 

వర్మ: ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియట్‌కి వెళ్లినప్పుడు చిరిగిన జీన్స్‌, బుడబుడక్కల రంగుల షర్టు, గోల్డ్‌ షూస్‌తో వెళ్లాను. అక్కడ నన్ను ‘ఏంటి ఇది’ అని అడిగారు. ఫస్టఫాల్‌ సీరియస్‌ మ్యాటర్‌ మాట్లాడాల్సినపుడు సీరియ్‌సగా రెడీ అవ్వాల్సిన అవసరం లేదు. మనం మైండ్‌తో మాట్లాడుతున్నాం. థాట్‌ అనాలసిస్‌ చేస్తున్నాం. పిచ్చోడా? తిక్కోడా? తింగరోడా? పర్వర్టెడా? అనుకున్నా.. నా స్టయిల్‌లో చెప్పా. 


ఆర్కే: జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారు. గత సీజన్‌లో ‘ఐ యామ్‌ పర్వర్టెడ్‌ ఇంటెలిజెంట్‌’ అన్నారు కదా..

వర్మ: అందరిలో పర్వర్షన్‌ ఉంటుంది.


ఆర్కే: ఇది కూడా ఒకరకమైన ఎంటర్‌టైన్‌మెంటా?

వర్మ: బేసికల్లీ.. మీరు నమ్ముతారో లేదో తెలీదు కానీ.. నేను ట్రూత్‌ని నమ్ముతాను. ఎందుకంటే మీరు అబద్ధం  చెబుతూ నిజమైన సత్యాన్ని దాస్తున్నపుడు ప్రెజర్‌ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడెయితే మీరు ఏంటనేది ఎగ్జాట్‌గా బయటపెట్టేసినపుడు.. ఎవరేమి అనుకుంటే ఏంటీ? అనుకున్నపుడు మీ లైఫ్‌ మీరు బతుకుతారు.


ఆర్కే: పైలా పచ్చీస్‌ టైప్‌లో ఉండే వర్మ ట్రేడ్‌ యూనియన్‌ లీడర్‌?

వర్మ: అది కరెక్ట్‌ కాదు. ఇండస్ర్టీ తరఫున వెళ్లలేదు. ఎవరితో మాట్లాడి వెళ్లలేదు. ప్రతి ఒక్కరికి వాడి ఇండస్ర్టీ ఉంటుంది. సినిమా మేకర్‌గా ఉన్నపుడు పొలిటికల్‌ లీడర్స్‌ కొన్ని మాటలు అన్నారు. దానికోసం వెళ్లా. నేను చెప్పినదో లేదా మిగతా పదిమంది చెప్పిందో వాళ్లు వినొచ్చు. తుది నిర్ణయం వారే తీస్కుంటారు. అది ఇండస్ర్టీ అందరికీ ఒకటే వర్తిస్తుంది. 


ఆర్కే: వర్మ రెండు ట్వీట్లు పెట్టగానే అపాయింట్‌మెంట్‌ వచ్చేసిందేంటీ? వారు భయపడ్డారా?

వర్మ: ఎవరూ ఎవరికీ భయపడరండీ. కలుస్తానన్నా ట్విటర్‌ ద్వారా. ‘సరే’నన్నారు మంత్రి. కలిసొచ్చా. 


ఆర్కే: రిజల్ట్‌ ఏంటీ. ఎవరు ఎవరిని కన్విన్స్‌ చేశారు?

వర్మ: నా పాయింట్స్‌ చెప్పా. స్టడీ చేసి కమిటీకి ఇన్‌పుట్స్‌ ఇస్తామన్నారు. 


ఆర్కే: పేదవాళ్లకు సరసమైన ధరలకు ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించాలని 1950 యాక్టులో ఉందా?

వర్మ: నేను లాయర్‌ కాదు. రాజ్యాంగ నిపుణుడిని కాదు. కానీ నాకు అర్థమైనంత వరకు ప్రభుత్వం ధరలను నిర్ణయిస్తుందని ఖచ్చితంగా ఎక్కడా లేదు. దానిని మొన్న పాస్‌ చేసిన చట్టంలో  పెట్టారు. 1950 యాక్టులో ఇది ఉంటే కోర్టులో చాలెంజ్‌ చేస్తానన్నా. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మాన్యుఫాక్చర్‌కి, కన్జ్యూమర్‌కి మధ్య గవర్నమెంట్‌ ఎలా వస్తుందో అనే మెయిన్‌పాయింట్‌ ఎవరూ మాట్లాడలేదు. అది వదిలేసి ఎంత సేపు ఇంకో షో పెంచండి. ఇంకో యాభై రూపాయలు, ఇంకో ఇరవై రూపాయలు పెంచండి అనే ఆ బెగ్గింగ్‌ యాటిట్యూడ్‌ అర్థం కావట్లేదు. 


ఆర్కే: అసలు తెలుగు ఇండస్ర్టీకి దూరమైపోయిన  మీరు సడెన్‌గా ఈ విషయంలో ఎందుకు వచ్చారు. 

వర్మ: నాకు కానీ నా బిజినె్‌సకి గానీ సంబంధం లేదు. సినిమాల్లో లేకపోయినా ఇలా ప్రశ్నించేవాణ్ణి. 


ఆర్కే: జగన్మోహన్‌రెడ్డిగారి మీద అపారమైన ప్రేమ ఉంది కదా..

వర్మ: అలా నేనెప్పుడూ చెప్పలేదు. అయితే ఆయన  ప్రజల్లో కలిసి పోయి మామూలుగా ఉండటమనేది నాకు నచ్చిన విజువల్‌. దాన్ని తప్పిస్తే ఆయన పాలసీ ఏంటీ? ఆయనేంటి? తక్కిన విషయం తెలీదు.  


ఆర్కే: గవర్నమెంట్‌ ఎలా ఉన్నా సంబంధం లేదా?

వర్మ: అవును. అయితే.. మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ గారు పవన్‌ కళ్యాణ్‌గారికి ఎందుకంత రెమ్యునరేషన్‌ ఇవ్వాలి? సినిమాకు ఎందుకంత ఖర్చుపెట్టాలి? అనే విషయం చెప్పారు. అది విన్నాక.. చాలా హర్టయ్యా. ఇరిటేట్‌ అయ్యా. అసలు ఇండస్ర్టీకి సంబంధం లేనివారు సినిమాలు ఎలా తీయాలని చెబుతారేంటీ? బూందీ, చక్కెర కలిపితే లడ్డూ అవుతుంది. దీంట్లో కిస్మిస్‌, జీడిపప్పు ఎందుకెయ్యాలి అంటే ఎలా? లడ్డూ నీకోసం చేయలేదు. ఎవరైతే పవన్‌ కళ్యాణ్‌ అభిమానులున్నారో వారికోసం జీడిపప్పు వేశారు.. మంచి వాసన రావాలని. సినిమా తీయడానికి ఇరవై శాతం ఖర్చు అవుతుందంటారు. అసలు రెమ్యునరేషన్‌ను సపరేట్‌ ఎందుకు చేస్తున్నారు? మీరు మొత్తం సినిమాను తీసుకుంటే అన్నీ రెమ్యూనరేషన్లే ఉంటాయి. లైట్‌బాయ్‌కి కూడా డబ్బులే కదా ఇచ్చేది. అలాగే హీరోకి ఇస్తున్నారు.

హీరోని పక్కనబెడితే ఐఫోన్‌ను పగలగొడితే.. అద్దం, ముడిపదార్థాలు, వైర్ల విలువ వెయ్యిరూపాయలు కూడా ఉండదు. మీరు లక్షా పద్దెనిమిది వేలు పోసి ఎందుకు కొంటున్నారంటే అది బ్రాండ్‌. దాని వెనకాల ఐడియా. ఇది అర్థం చేసుకోకుండా హీరోకి అంత రెమ్యునరేషన్‌ అని అంటే ఎలా? 


ఆర్కే:  మీకు పవన్‌కళ్యాణ్‌కి పడదు కదా?

వర్మ: అది కూడా తప్పేనండి. పవన్‌కళ్యాణ్‌ జనసేన ఫస్ట్‌ మీటింగ్‌ టెర్రిఫిక్‌. వైజాగ్‌లో నచ్చలేదని అభిప్రాయం చెప్పా. ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ హిందీలో చేయద్దు. వర్కవుట్‌ కాదు.. బాహుబలి లాంటి సినిమా చేయాలి అని చెప్పా. నేను పవన్‌ కళ్యాణ్‌గారి మీద అభిమానంతో అలా చేశా. నిజం చెబితే ఎవరికీ నచ్చదు.


ఐకమత్యం ఎక్కడా ఉండదు. అది చెప్పినోడు వందశాతం పిచ్చోడు. సినిమా ఇండస్ర్టీలో ఉండే జెలసీ ఏ రంగంలో ఉండదు. ప్రెషర్‌, మనీ, పేరు ఉంటుంది. మానవ సహజమైన కుళ్లు ఉంటుంది. ప్రతి ఒక్కరికీ ఎజెండా ఉంటుంది. వారందరూ ఐకమత్యం కారు. ఎవరూ ఎవరినీ పట్టించుకోరు. 


కేసీయార్‌ ఇక్కడ రేట్లు పెంచారు. అక్కడలాగే ఇక్కడా జరిగింది. సినిమా టికెట్‌ రేట్లలోకి గవర్నమెంట్‌ ఇన్వాల్వ్‌ అవ్వకూడదు. 1950లో టూరింగ్‌టాకీ్‌సలుండేవి.. అందుకే అలా చట్టం చేశారేమో!

ఆర్కే: మీరు కొంటెగా చెబుతారు. అది నిజమా. వెటకారమా? అర్థమై చావదు చాలామందికి..

వర్మ: అది నా తప్పు ఎలా అవుతుందండి.  


ఆర్కే: ఈ సమస్య థియేటర్ల ఓనర్లదా?

వర్మ:  సినిమాటోగ్రఫీ యాక్ట్‌లో ఉండే కండిషన్లు బట్టి థియేటర్‌లోని ఫైర్‌ సేఫ్టీలు. కాంపౌండ్‌ వాల్‌ ఎంత దూరముండాలి?.. లాంటి వేరియస్‌ ఫ్యాక్టర్స్‌ ఉన్నాయి. ఎక్కువ థియేటర్లలో అవిలేవు అనేది గవర్నమెంట్‌ పాయింట్‌. అది కరెక్టే. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఇష్యూమీద ఎందుకు పడ్డారనేదే పాయింట్‌. 


ఆర్కే: ఇష్యూ అంతా ఇదే. నాకు ఊహ తెలిసినప్పటినుంచి ఆఫీసర్లు ఇన్ని రకాల తనిఖీలు చేయలేదు. 

వర్మ: స్ర్టిక్ట్‌గా చేస్తే సగం థియేటర్లు మూసేస్తారు.


ఆర్కే: నిబంధనలు పాటిస్తున్నారా? అని చెక్‌ చేస్తే దేశంలో ఆసుపత్రులన్నింటినీ మూసేయాలి. గవర్నమెంట్‌ ఆసుపత్రులతో సహా..

వర్మ: కరెక్ట్‌. వారు తమకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తున్నారు.


ఆర్కే: సినిమా ఇండస్ర్టీతో బాగా ఆడుకోవచ్చు అని ప్రూవ్‌ చేసింది జగన్మోహన్‌ రెడ్డి. ఇది కరెక్టేనా?

వర్మ: ఆడుకోవడానికి అలా చేస్తున్నారా? మనకు అలా అనిపిస్తుందా? అనేదే పాయింట్‌.


ఆర్కే: వర్మ సాహసాలకు మారుపేరంటారు. చంద్రబాబు సీఎమ్‌గా ఉన్నపుడు ‘లక్ష్మీస్‌ ఎన్టీయార్‌’ తీశారు. ఇప్పుడు జగన్‌మోహన్‌ రెడ్డి మీద తీయగలరా?

వర్మ: 35 ఏళ్ల కిత్రం జరిగిన ఇన్సిడెంట్‌లో ఉండే డ్రమాటిక్‌ యాస్పెక్టులో ఆ సినిమా తీశా. అంతేకానీ చంద్రబాబుగారికి వ్యతిరేకం కాదు.


ఆర్కే: ఈ రెండున్నర సంవత్సరాలలో మీకు డ్రామా కనిపించట్లేదా? ఎంపీ రఘురామరాజు గారిని తీసుకెళ్లి కాళ్లు పగిలేట్లు జైల్లో కొట్టారు. అయితే బయటికి కనిపించినట్లు మగధీరుడు, వీరుడు కాదు.. మీలో లౌక్యం ఉంది. 

వర్మ: నేను ఏదీ పట్టించుకోను. ఏదైనా డ్రామా ఎలిమెంట్‌ నచ్చితేనే తీస్తా.


ఆర్కే: ఇంకో సినిమా సబ్జెక్టు చెప్తా. తీస్తారా? వివేకానందరెడ్డి హత్య సబ్జెక్టు..

వర్మ: ఎన్నో సంఘటనలు జరుగుతాయి. వాటిలో ఉండే ఇన్‌స్పైరింగ్‌ విషయాలను బట్టే తీస్తా. వివేకానందరెడ్డి మర్డర్‌ కేస్‌ నేను ఫాలో కాలేదు. ఎవరు చేశారా? అనేది తెలీదు. అది క్లోజ్‌ అయ్యాక.. సినిమా తీయచ్చు. తీయకపోవచ్చు. అది నా ఇష్టం.


ఆర్కే: మీ సినిమాల ప్రమోషన్‌లో భాగంగా ఏదోటి చేస్తుంటారు కదా. మంత్రిని కలవడంలో దానిలో భాగం కాదు కదా?

I do not understand that begging attitude! కాదండి. అలా కలవటానికి సంబంధమేముంటుంది? 500 కోట్లతో తీసిన దర్శకులు ఏమి చేయలేకపోయారు. కోటి బడ్జెట్‌లో తీసే నా సినిమాలను పట్టించునేవారెవరూ. దాని ద్వారా ప్రమోషన్‌ నాకేమొస్తుంది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.