నేనే బాగా పోజ్‌ ఇవ్వగలను

ABN , First Publish Date - 2021-01-24T06:40:19+05:30 IST

అనుపమా పరమేశ్వరన్‌ తనకు సంబంధించిన ఆప్‌డేట్‌లతో సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆమెకు ట్రావెలింగ్‌, ఫొటోగ్రఫీ అంటే ఆమితమైన ప్రేమ.

నేనే బాగా పోజ్‌ ఇవ్వగలను

నుపమా పరమేశ్వరన్‌ తనకు సంబంధించిన ఆప్‌డేట్‌లతో సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆమెకు ట్రావెలింగ్‌, ఫొటోగ్రఫీ అంటే ఆమితమైన ప్రేమ. కుదిరిన ప్రతిసారి టూర్‌కు వెళ్తూ అక్కడి అందాలను తన కెమెరాలో బంధిస్తారు. తాజాగా తన మీదే తాను ప్రయోగం చేసుకున్నారు. కెమెరాకు డిఫరెంట్‌గా సూపర్‌ ఫోజ్‌లిచ్చి ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. 


‘మీ అందరికంటే నేనే ఫొటోలకు బాగా పోజ్‌ ఇవ్వగలను. అందుకు ఈ ఫొటోలే నిదర్శనం’ అని కామెంట్‌ చేసింది. ప్రస్తుతం అనుపమా పరమేశ్వరన్‌ నిఖిల్‌ సరసన ‘18 పేజేస్‌’ చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. 

Updated Date - 2021-01-24T06:40:19+05:30 IST