Tokyo Paralympics: నా కుమార్తె స్వర్ణం ఖచ్చితంగా గెలుస్తోంది...

ABN , First Publish Date - 2021-08-28T15:58:14+05:30 IST

టోక్యో పారా ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ పోటీల్లో భవీనా పటేల్ ఫైనల్ చేరుకున్న తర్వాత ఆమె తండ్రి హస్ముఖ్ భాయ్ పటేల్ శనివారం మీడియాతో మాట్లాడారు.....

Tokyo Paralympics: నా కుమార్తె స్వర్ణం ఖచ్చితంగా గెలుస్తోంది...

భవీనా తండ్రి హస్ముఖ్ భాయ్ పటేల్ విశ్వాసం

అహ్మదాబాద్ (గుజరాత్): టోక్యో పారా ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ పోటీల్లో భవీనా పటేల్ ఫైనల్ చేరుకున్న తర్వాత ఆమె తండ్రి హస్ముఖ్ భాయ్ పటేల్ శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను. నా కుమార్తె భవీవనా పటేల్ ఖచ్చితంగా బంగారు పతకం గెలుచుకోబోతోంది. గత 20 సంవత్సరాలుగా భవీనా టేబుల్ టెన్నిస్ ఆడుతోంది’’ అని భవీనా తండ్రి హస్ముఖభాయ్ పటేల్ చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న టోక్యో పారాలింపిక్స్‌లో భారత పారా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనాబెన్ పటేల్ గోల్డ్ మెడల్ మ్యాచ్‌లోకి దూసుకెళ్లిన తర్వాత, ఆమె తండ్రి హస్ముఖ్ భాయ్ పటేల్ తన కుమార్తె కచ్చితంగా విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 


అంతకు ముందు భవీనా ఫైనల్ కు చేరుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘‘నేను టోక్యో పారాఒలింపిక్స్ లో ఫైనల్ కు చేరుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు, ప్రతీ మ్యాచ్ లోనూ 100 శాతం దృష్టి పెట్టాను, ఇలాగే నా ప్రదర్శన కొనసాగితస్తే నేను ఖచ్చితంగా బంగారు పతకం గెలుస్తాను’’ అని భవీనా బెన్ చెప్పారు. భవీనా బెన్ పటేల్ టోక్యో పారాఒలింపిక్స్ లో శనివారం చైనా క్రీడాకారిణి జాంగ్ మియావోను ఓడించింది.పారాలింపిక్ గేమ్స్ టేబుల్ టెన్నిస్ పోటీలో సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించిన మొదటి భారతీయురాలిగా భవీనా శనివారం రికార్డు సృష్టించింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ క్లాస్ 4 విభాగంలో కేవలం 18 నిమిషాల్లో సెర్బియాకు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ బోరిస్లావా పెరిక్-రాంకోవిచ్‌ని 34 ఏళ్ల గుజరాత్‌కు చెందిన పాడ్లర్ భవీనా ఓడించింది. 

Updated Date - 2021-08-28T15:58:14+05:30 IST