Amaravathi: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ తరుపున టికెట్ ఇచ్చి గెలిపించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
‘‘ఉపఎన్నిక ఫలితాలతో పాటు ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై సీఎంతో చర్చించాను. నియోజకవర్గ అభివృద్ధికి ప్రతిపాదనలను ఆయన ముందు ఉంచాం. వాటిపై సీఎం సానుకూలంగా స్పందించారు. రాష్ట్రాన్నిపారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి మా అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి ఎంతో కృషి చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిస్తా. మంత్రివర్గంలో స్థానం కల్పించే అంశం సీఎం సమావేశంలో చర్చకు రాలేదు. నేను ఇప్పుడే ఎమ్మెల్యే అయ్యాను. నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో నేను మంత్రి పదవికి అనర్హుడిని’’ అని విక్రమ్ రెడ్డి అన్నారు.
మంత్రి గౌతం రెడ్డి మృతితో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి రీ పోలింగ్ నిర్వహించారు. గౌతం రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డిని వైసీపీ బరిలో దింపింది. బీజేపీ తరుపున భరత్ కుమార్, బీఎస్పీ తరుపున ఓబులేసు పోటీలో ఉన్నారు. మొదటి రౌండ్ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగారు. ఇదిలా ఉండగా.. ఈ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు. బీజేపీకి 19,352 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి 1,02,074 ఓట్లు పోలయ్యాయి. ఇతరులకు 11,496 ఓట్లు, నోటాకు 4,179 ఓట్లు పోలవడం విశేషం. బీఎస్పీ అభ్యర్థి ఓబులేష్‌కు 4,897 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి విక్రమ్‌రెడ్డి (Vikram Reddy) 82,888 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఇవి కూడా చదవండి