Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 23 2021 @ 07:29AM

Uttar‌Pradesh: పేదలు,బలహీనవర్గాల వారికి నేను తండ్రిలాంటి వాడిని...

మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు

సంభాల్ (ఉత్తరప్రదేశ్): మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంటుసభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీకేయూ రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌లు తాము ‘అబ్బాజాన్’ ‘చాచాజాన్’లమంటూ చేసిన వ్యాఖ్యలపై ఒవైసీ విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్‌లో పేదలు, బలహీన వర్గాలు, అణచివేతకు గురైన వారికి తాను తండ్రి లాంటివాడినని ఒవైసీ పేర్కొన్నారు. అణచివేతకు గురైన మహిళలకు, బాధితులకు తాను సోదరుడినని ఒవైసీ వ్యాఖ్యానించారు.యూపీలోని సంబల్ జిల్లాలో జరిగిన బహిరంగ ర్యాలీలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

 యూపీ సీఎం యోగి చేసిన అబ్బాజాన్ వ్యాఖ్యలపై ఒవైసీ నిప్పులు చెరిగారు. సీఎం యోగి అబ్బాజాన్ ఎందుకు అనాలని, దానికి బదులుగా పితాజీ అనాలని సూచించారు.తాను బీజేపీకి బీ జట్టు అని వ్యాఖ్యలు చేసిన రాకేష్ తికాయత్ పై ఒవైసీ విమర్శలు చేశారు. రాకేష్ తికాయత్ కు బీజేపీ ఆశీర్వాదముందని, అందుకే అతనిపై బీజేపీ సర్కారు కేసులు పెట్టదని ఒవైసీ చెప్పారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ మజ్లిస్ పార్టీ 100 సీట్లలో పోటీ చేస్తుందని ఒవైసీ ప్రకటించారు.

2017 అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ 38 స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టింది, కానీ ఒక్క నియోజకవర్గాన్ని కూడా గెలవలేకపోయింది. ఉత్తర ప్రదేశ్‌లో 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే ఒవైసీ అధికార భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేశారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement