Aryan Khan లాంటి బాధితుడిని: ED కేసులపై Jharkhand CM

ABN , First Publish Date - 2022-05-29T22:48:47+05:30 IST

MGNREGA కుంభకోణంపై రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే స్థానిక అధికారులను ఏమాత్రం సంప్రదించకుండానే విచారణ చేపట్టారు. దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా కుంభకోణంపై లోతుగా విచారణ చేపట్టేందుకు ఈడీ సిద్ధంగా లేదు..

Aryan Khan లాంటి బాధితుడిని: ED కేసులపై Jharkhand CM

రాంచీ: కొంత మంది దురుద్దేశంతో తప్పుడు కేసు రూపొందించి షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌(Aryan Khan)ను డ్రగ్స్ కేసులో ఇరికించారని, తాను కూడా తాను కూడా ఆర్యన్ ఖాన్ లాంటి బాధితుడినేనని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్(Jharkhand Chief Minister Hemant Soren) అన్నారు. తాజాగా మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం(MGNREGA) పనిలో అవకతవకలు జరిగినట్లు, అలాగే మైనింగ్‌‌ లీజుల్లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు రావడంతో హేమంత్ సోరెన్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులను ఆర్యన్ ఖాన్‌పై వచ్చిన డ్రగ్స్ కేసులతో పోల్చుతూ పై విధంగా పోల్చారు సోరెన్.


‘‘MGNREGA కుంభకోణంపై రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే స్థానిక అధికారులను ఏమాత్రం సంప్రదించకుండానే విచారణ చేపట్టారు. దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా కుంభకోణంపై లోతుగా విచారణ చేపట్టేందుకు ఈడీ సిద్ధంగా లేదు. కేవలం వారికి కేటాయించిన పని పూర్తి చేసే పనిలో ఉన్నారని స్పష్టమవుతోంది’’ అని అన్నారు. అలాగే ఈ కేసు 14 ఏళ్ల క్రితందని చెప్పిన ఆయన ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘‘ప్రస్తుతం ఈడీ విచారణ చేస్తున్న కేసు 14 ఏళ్ల క్రితం నాటిది. బీజేపీకి ఇలాంటివి అలవాటే. అవసరమైతే 500 ఏళ్ల క్రితం నాటి కేసులైనా తీస్తారు. వందల ఏళ్ల గుడులు, మసీదులపై వాళ్లు చేస్తున్న దాడి అలాంటిదే’’ అని హేమంత్ సోరెన్ అన్నారు.

Updated Date - 2022-05-29T22:48:47+05:30 IST