నేను స్వేచ్ఛా జీవిని. జెడ్ సెక్యూరిటీ అక్కర్లేదు: అమిత్ షాకు ఓవైసీ సమాధానం

ABN , First Publish Date - 2022-02-08T02:53:28+05:30 IST

నేను స్వేచ్ఛా జీవిని. జెడ్ సెక్యూరిటీ అక్కర్లేదు: అమిత్ షాకు ఓవైసీ సమాధానం

నేను స్వేచ్ఛా జీవిని. జెడ్ సెక్యూరిటీ అక్కర్లేదు: అమిత్ షాకు ఓవైసీ సమాధానం

లఖ్‌నవూ: కేంద్ర ప్రభుత్వం కేటాయించిన జెడ్ కేటగిరీ సెక్యూరిటీ తనకు అక్కర్లేదని, తాను స్వేచ్ఛా జీవినని హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. సోమవారం పార్లమెంట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు. ‘‘ఈరోజు పార్లమెంట్‌లో జెడ్ కేటగిరీ తీసుకొమ్మని హోంమంత్రి అమిత్ షా నన్ను కోరారు. కానీ సీఏఏ నిరసనలో చనిపోయిన 22 మంది వ్యక్తుల కంటే నా ప్రాణాలు ఎక్కవనా? నా చట్టు భద్రతా వలయాన్ని పెట్టుకుని ప్రజల మధ్యకు వెళ్లలేను. నేను స్వేచ్ఛా జీవిని. స్వేచ్ఛగా జీవించాలని అనుకుంటున్నాను’’ అని ఓవైసీ ట్వీట్ చేశారు.

Updated Date - 2022-02-08T02:53:28+05:30 IST