‘క్లౌడ్‌’కి హైసియా సీఓఈ

ABN , First Publish Date - 2021-07-23T05:41:23+05:30 IST

క్లౌడ్‌ టెక్నాలజీ కోసం హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌

‘క్లౌడ్‌’కి హైసియా సీఓఈ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): క్లౌడ్‌ టెక్నాలజీ కోసం హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) ఎక్సలెన్స్‌ సెంటర్‌ (సీఓఈ)ను ప్రారంభించింది. క్లౌడ్‌ టెక్నాలజీలో ఉద్యోగ నైపుణ్యాలను పెంచడం, స్టార్ట్‌పలకు మద్దతుగా ఉండడం, పరిశోధన, ఉత్పత్తుల అభివృద్ధిని ప్రోత్సహించడం వంటి కార్యకలాపాలను సీఓఈ నిర్వహిస్తుందని హైసియా ప్రెసిడెంట్‌ భరణి కే అరోల్‌ తెలిపారు. ఈ కేంద్రాన్ని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ ప్రారంభించారు. 


Updated Date - 2021-07-23T05:41:23+05:30 IST