Advertisement
Advertisement
Abn logo
Advertisement

పిల్లలు డల్‌గా ఉండి, ఏడుస్తూ పాలు తాగడం లేదా.. దానికి కారణం ఏంటంటే?

ఆంధ్రజ్యోతి(16-11-2021)

పిల్లలు ఏడుస్తున్నారు, పాలు తాగడం లేదు, డల్‌గా ఉంటున్నారు.... ప్రతి తల్లీ పిల్లల గురించి చేసే కంప్లెంట్సే ఇవి. అయితే అందుకు హైపో థైరాయిడ్‌ కూడా ఓ కారణం కావచ్చు. పుట్టుకతో, స్వతఃసిద్ధంగా... ఇలా రెండు రకాలుగా హైపో థైరాయిడ్‌ సమస్యలు పిల్లల్లో తలెత్తుతూ ఉంటాయి. పుడుతూనే వెంట తెచ్చుకునే హైపో థైరాయిడ్‌ను వీలైనంత త్వరగా కనిపెట్టి, చికిత్స చేయకపోతే ఐక్యు తగ్గిపోయి, బుద్ధిమాంద్యం మొదలవుతుంది. ఈ పరిస్థితిని చికిత్సతో సరిదిద్దడం అసాధ్యం. కాబట్టి పుట్టిన 48 గంటల్లోపు కామెర్ల కోసం రక్తపరీక్ష చేయించినట్టే, పిల్లలకు థైరాయిడ్‌ పరీక్ష కూడా చేయించాలి. హైపోథైరాయిడ్‌ వల్ల తొమ్మిది, పది నెలల వయసు పిల్లల్లో మార్పులు స్పష్టంగా కనిపించడం మొదలయ్యాక పొరపాటు గ్రహించి, చికిత్స ఇప్పించినా జరిగిపోయిన నష్టాన్ని భర్తీ చేసే పరిస్థితి ఉండదు. ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌లో భాగంగా కూడా పిల్లల్లో థైరాయుడ్‌ సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి కౌమారంలోకి అడుగుపెట్టిన పిల్లలకు తప్పనిసరిగా థైరాయిడ్‌ పరీక్ష చేయించాలి. అలాగే పిల్లల్లో ఈ లక్షణాల మీద ఓ కన్నేసి ఉంచాలి.


మెడ ముందు భాగంలో వాపు

వయసుకు తగిన ఎత్తు పెరగకపోవడం (ఏడాదికి రెండు అంగుళాలు)

ముందుకంటే చదువులో వెనక పడడం

హఠాత్తుగా బరువు పెరగడం

మలబద్ధకం

బద్ధకం, అతి నిద్ర

Advertisement
Advertisement