Hypertension: అధిక రక్తపోటు సమస్యా..? అయితే బీ కేర్‌ఫుల్.. రిస్క్ లేకుండా వ్యాయామం ఎలా చేయాలంటే..

ABN , First Publish Date - 2022-07-27T19:50:25+05:30 IST

శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవ‌డం, ర‌క్త‌నాళాలు గ‌ట్టిప‌డిపోవ‌డం వ‌ల్ల హైపర్‌టెన్షన్ మొదలవుతుంది.

Hypertension: అధిక రక్తపోటు సమస్యా..? అయితే బీ కేర్‌ఫుల్.. రిస్క్ లేకుండా వ్యాయామం ఎలా చేయాలంటే..

శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవ‌డం, ర‌క్త‌నాళాలు గ‌ట్టిప‌డిపోవ‌డం వ‌ల్ల హైపర్‌టెన్షన్ మొదలవుతుంది. ఈ సమస్య వచ్చిందంటే తీవ్రమైన గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, మెద‌డు సంబంధ ర‌క్త‌నాళాల్లో ఇబ్బందులు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. సాధార‌ణంగా ప్ర‌వ‌హించే వేగానికి విరుద్ధంగా ర‌క్తం ప్ర‌వ‌హిస్తుండ‌టం వ‌ల్ల అనేక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. ఇది ఉన్నవారు త్వరగా దీర్ఘకాలిక గుండెజబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి తగిన వ్యాయామం చాలా అవసరం.


రక్తపోటు ఉన్నవారు రొటీన్ వర్కవుట్స్ చేయడానికి సరైన మార్గాలను గురించి చెప్పుకుందాం :


1. వామ్-అప్

హైపర్‌టెన్షన్ ఉన్నవారు శరీరం అంతా ఒక్కసారిగా కదిలేలా వ్యాయామం చేయడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. వర్కవుట్స్ చేసే ముందు వామ్-అప్ లాంటివి చిన్నచిన్నవి మొదలు పెట్టి చేయడం వల్ల రక్తపోటును సమతుల్యం చేవచ్చు.


2. కూల్ డౌన్

వర్కవుట్ సెషన్ తర్వాత రక్తపోటు పెరుగుతుంది. అలాగే కొద్దిగా పని చేసినా మన గుండె చప్పుడు పెరుగుతుంది. దీనిని నియంత్రణలో పెట్టాలంటే కూల్ డౌన్ వ్యాయామాలు చేయడం వల్ల ఒత్తిడిని సాధారణ స్థాయికి తీసుకురావడానికి సహాయపడతాయి.


3. కార్డియోను చేర్చండి

కార్డియో వ్యాయామాలు హృదయ స్పందనను పెంచుతాయి. అధిక రక్తపోటు ఉన్నవారు దీనిని నివారించవచ్చు. అయితే, కార్డియో వ్యాయామాలు మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 


4. భుజాలను సాగదీయండి

వామ్-అప్, కూల్-డౌన్ వ్యాయామాల మాదిరిగానే, భుజాలను సాగదీయడం వల్ల మన శరీరం క్రమంగా బలపడుతుంది. 


5. అవసరమైతే విరామం తీసుకోండి.

వర్కవుట్స్ ఎక్కువగా చేసినపుడు తలతిరగడం, మెడ, దవడ, చేయి లేదా భుజం చుట్టూ ఏదైనా ఒత్తిడి, నొప్పి అనిపిస్తే, వెంటనే వ్యాయామాన్ని ఆపి విరామం తీసుకోండి.


6. ఈత అటవాటు చేసుకోండి.

అధిక రక్తపోటు ఉన్నవారికి ఈత ఉత్తమ వ్యాయామం. స్విమ్మింగ్ చేయడం వల్ల అధిక రక్తపోటు ఉన్నట్లయితే కంట్రోల్ ఉండటమే కాకుండా బరువును నియంత్రించడంలో ఉంచడంలో ఈత సహకరిస్తుంది. 


7. కూర్చొని చేసే వర్సవుట్స్ ప్రయత్నించండి.

కాస్త శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం ఇబ్బందిగా అనిపించినపుడు సిట్టింగ్ వర్కవుట్స్ మొదలు పెట్టడం మంచిది ఇవి అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.


వ్యాయామం చేసేటప్పుడు కొన్ని సులువైన మార్గాలను ఎంచుకోవడం శరీరంతో కమ్యూనికేట్ చేయడం అవసరం. హైపర్‌టెన్షన్ ఉన్నట్లయితే బ్రేక్‌లు తీసుకోవడం ఇంటెన్సిటీని నెమ్మదిగా పెంచుకోవడం సరైన మార్గం. ఆరోగ్యకరమైన ఆహారం, మంచి అలవాట్లతో హైపర్‌టెన్షన్ ని నిరోధించవచ్చు. ఇది ప్రమాదకరస్థాయికి చేరకుండా నిరోధించేందుకు ముందు జాగ్రతగా వైద్య సలహాలు, చికిత్స అవసరమే.

Updated Date - 2022-07-27T19:50:25+05:30 IST