భారత్‌లో పెద్ద ఎత్తున హైడ్రాక్సీ క్లోరోక్వీన్ నిల్వలు: కేంద్ర ఆరోగ్య శాఖ

ABN , First Publish Date - 2020-04-10T22:56:31+05:30 IST

న్యూఢిల్లీ: భారత్‌కు కోటి హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మాత్రలు చాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.

భారత్‌లో పెద్ద ఎత్తున హైడ్రాక్సీ క్లోరోక్వీన్ నిల్వలు: కేంద్ర ఆరోగ్య శాఖ

న్యూఢిల్లీ: భారత్‌కు కోటి హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మాత్రలు చాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. భారత్‌లో ప్రస్తుతం 3.28 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మాత్రలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. దీంతో దేశంలో హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మాత్రల స్టాకుపై ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి.


హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ మాత్రలకు సంబంధించి ప్రపంచంలోనే అతి పెద్ద ఉత్పత్తిదారైన భారత్‌పై అమెరికా, బ్రెజిల్, ఇజ్రాయిల్, యూరప్ దేశాలు గంపెడాశలు పెట్టుకున్నాయి. తమకు హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మాత్రలు పంపాలని భారత్‌ను కోరాయి. కొన్ని దేశాలు హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మాత్రల తయారీకి ముడి పదార్థాలు పంపాలని కూడా కోరాయి. ప్రపంచదేశాల విజ్ఞప్తి మేరకు సరిపడా స్టాకు ఉంచుకుని మిగతావి ఎగుమతి చేయాలని భారత్ నిర్ణయించింది. దీంతో కష్టకాలంలో భారత్‌ ఆదుకుంటోందని ప్రపంచ దేశాలు పొగడ్తలు కురిపించాయి. 


మలేరియా మందుగా పేరున్న హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ కరోనాకు బాగా పనిచేస్తుందని ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి. ట్రంప్ అయితే హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌‌ను గేమ్ చేంజర్‌గా అభివర్ణిస్తున్నారు. తొలుత కాదన్నా తర్వాత ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ట్రంప్ మోదీని ఆకాశానికెత్తేశారు కూడా. మిగతా దేశాధినేతలు కూడా హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ సరఫరాపై భారత నాయకత్వాన్ని అభినందించారు. 

Updated Date - 2020-04-10T22:56:31+05:30 IST