వైస్‌ చైర్మన ఎంపికలో హైడ్రామా

ABN , First Publish Date - 2021-07-31T06:06:54+05:30 IST

హిందూపురం రెండో మున్సిపల్‌ వైస్‌ చెర్మన ఎంపికలో హైడ్రామా నడిచింది.

వైస్‌ చైర్మన ఎంపికలో హైడ్రామా
ఎన్నికైన బలరాంరెడ్డిని అభినందిస్తున్న సబ్‌ కలెక్టర్‌ నవీన


- ఎమ్మెల్సీ శిబిరానికి షాకిచ్చిన అధిష్టానం 

- రెండో వైస్‌ చైర్మెనగా బలరామిరెడ్డి ఎంపిక 

- వైసీపీలో గందరగోళం


హిందూపురం, జూలై 30: హిందూపురం రెండో మున్సిపల్‌ వైస్‌ చెర్మన ఎంపికలో హైడ్రామా నడిచింది. శుక్రవారం ఉదయం దాకా ఎమ్మెల్సీ ఇక్బాల్‌ చెప్పిన వారే మున్సిపల్‌ రెండో వైస్‌ చైర్మెన అంటూ పార్టీలో ప్రచారం నడిచింది. నాటకీయ పరిణామాలతో అందరి అంచనాలను తలకిందులా చేస్తు అనుహ్యంగా మున్సిపల్‌ రెండో వైస్‌ చెర్మనగా బలరామిరెడ్డిని ఎంపికతో ఎమ్మెల్సీ శిబిరానికి అధిష్టానం షాక్‌ ఇచ్చారు. శుక్రవారం మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించి రెండో వైస్‌ చెర్మన ప్రక్రియకు సిద్దం చేశారు. ఇప్పటికే మున్సిపల్‌ చైర్మెన పదవి ఆశించి చేజారిన మారుతిరెడ్డిని రెండో మున్సిపల్‌ వైస్‌ చెర్మనగా ఎంపిక లాంఛనమేనని కౌన్సిలర్లు, పార్టీ అందరూ భావించారు. గురువారం రాత్రి పొద్దుపోయే దాక రెండో వైస్‌ చెర్మన ఆశిస్తున్న ఆశావాహులతో ఎమ్మెల్సీ ఇక్బాల్‌ చర్చలు నడిపారు. ఇందులో భాగంగా మారుతిరెడ్డికి వదిలి వేయాలని బలరామిరెడ్డిని ఒప్పించారు. ఇందుకు బలరామిరెడ్డి కూడా సమ్మతించినట్లు పార్టీ పెద్దలతో మట్లాడించారు. శుక్రవారం ఉదయం ఎమ్మెల్సీ నివానంలో మారుతిరెడ్డిని వైస్‌ చెర్మన ఎంపికపై ఏకాభిప్రాయం కోసం కౌన్సిలర్లు సమావేశాన్ని నిర్వహణకు సిద్దం చేశారు. ఈలోపే అనుహ్యంగా రెండో వైస్‌ చెర్మనగా బలరామిరెడ్డిని ఎంపిక చేసినట్లు అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శిబిరంలో నిర్వేదానికి లోనయ్యారు. 

ఎమ్మెల్సీ శిబిరానికి షాకిచ్చిన అధిష్టానం! 

మున్సిపల్‌ ఎన్నికల్లో మున్సిపల్‌ చెర్మన పదవి కోసం మారుతిరెడ్డి, బలరామిరెడ్డి పోటీ పడి వైసీపీ కౌన్సిలర్లు గెలుపు కోసం కోట్లు ఖర్చు చేశారు. మున్సిపల్‌లో 38 వార్డులకు గాను వైసీపీ బలం 30 మంది కౌన్సిలర్లు ఉండగా సామాజిక సమీకరణాల పేరుతో అనుహ్యంగా బీసీ వర్గానికి చెందిన ఇంద్రజను తెరపైకి తీసుకువచ్చి చైర్‌పర్సనగా ఎంపిక చేశారు. అయితే రెండేళ్లుగా హిందూపురం వైసీపీ ఇనచార్జీ వ్యవహారాలను పర్యవేక్షణ చేస్తున్నట్లు ఎమ్మెల్సీ ఇక్బాల్‌ అహమ్మద్‌  రెండో వైస్‌ చైర్మెన ఎంపికలో మాట చెల్లు బాటు జరుగుతుందని పార్టీ వర్గాలు భావించాయి. మున్సిపల్‌ చెర్మనపై ఆశలు పెట్టుకుని చేజారిన మారుతిరెడ్డి రెండో వైస్‌ చైర్మెనగా ఎంపికవుతారని అందరూ బావించారు. కానీ పార్టీ హై కమాండ్‌ మాత్రం బలరామిరెడ్డిని వైస్‌ చెర్మనగా తెరమీదకు తీసుకువచ్చి ఎంపికతో ఎమ్మెల్సీ వర్గానికి షాక్‌ ఇచ్చింది. 

వైసీపీలో గందరగోళం...

హిందూపురంలో గత సార్వత్రిక ఎన్నికల నుంచి ఎమ్మెల్సీ ఇక్బాల్‌, హిందూపురం పార్లమెంట్‌ వైసీపీ అధ్యక్షుడు నవీననిశ్చల్‌ మధ్య ఆదిపత్య పోరులో కోల్డ్‌వార్‌ జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా మున్సిపల్‌ రెండో వైస్‌ చెర్మెనగా బలరామిరెడ్డి ఎంపికతో  వైసీపీ శ్రేణుల్లో గందరగోళ పరిస్థితిలు ఏర్పడ్డాయి. మున్సిపల్‌ వైస్‌ చైర్మెన ఎంపికలో ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రభుత్వ సలహదారులు జోక్యం చేసుకుని ఎంపిక చేసినట్లు హిందూపురంలో చర్చంశనీంగా మారింది. నియోజక వర్గంలో ఓ సమాజీక వర్గానికి చెందిన కొందరు నాయకులు కలిసి మున్సిపల్‌ రెండో వైస్‌ చైర్మన ఎంపికలో కీలక పాత్ర వహించినట్లు తెలుస్తోంది. వీరికి ఓ మంత్రి, ఎంపీతోపాటు ఇటీవల రాష్ట్ర స్థాయిలో నామినేట్‌ పదవి పొందిన చైర్మెన సహాయ సహకారులు అందించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఇక్బాల్‌ వర్గీయుల దూకుడుకు బ్రేకులు వేసేందుకే వైసీపీలోని ఓ వర్గం ఇలా చేస్తోందా? అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

మారుతీరెడ్డికి మొండిచేయి..!

హిందూపురం మున్సిపల్‌ చైర్మన పదవి ఆశించి భంగపడ్డ 21 వార్డు కౌన్సిలర్‌ మారుతిరెడ్డికి చివరకు నిరాశేమిగిలింది. చైర్మన సీటు పోయినా రెండో వైస్‌ చైర్మెనతోనైనా సంతోష పడదామని బావించిన మారుతిరెడ్డికి అధిష్టానం మొండిచేయి చూపింది. ఇప్పటికే పార్టీ కోసం కోట్లరూపాయలు ఖర్చుచేసి మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ కౌన్సిలర్లు గెలుపు కోసం అంతానై వ్యవహరించారు. పదవుల ఎంపికలో ఎమ్మెల్సీపైనే భారం పెట్టుకున్న మారుతిరెడ్డికి చివరకు నిరాశేమిగిలిందని వైసీపీ శ్రేణులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నాయి.



Updated Date - 2021-07-31T06:06:54+05:30 IST