తాజ్ వద్ద డ్రోన్‌తో హైదరాబాదీలు... వార్నింగ్‌తో వదిలిన పోలీసులు

ABN , First Publish Date - 2021-10-01T23:23:47+05:30 IST

తాజ్ మహల్ హై సెక్యూరిటీ జోన్‌లో డ్రోన్‌ను గుర్తించిన ఉత్తర ప్రదేశ్

తాజ్ వద్ద డ్రోన్‌తో హైదరాబాదీలు... వార్నింగ్‌తో వదిలిన పోలీసులు

ఆగ్రా : తాజ్ మహల్ హై సెక్యూరిటీ జోన్‌లో డ్రోన్‌ను గుర్తించిన ఉత్తర ప్రదేశ్ పోలీసులు బుధవారం రాత్రి ముగ్గురు హైదరాబాద్ టూరిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఆ టూరిస్టులను ప్రశ్నించినపుడు ఇది నో-ఫ్లయింగ్ జోన్ అని తమకు తెలియదని చెప్పడంతో వారిని పోలీసులు హెచ్చరించి, వదిలిపెట్టారు. 


ఉత్తర ప్రదేశ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ షంషుద్దీన్ అహ్మద్, శివ ప్రసాద్, భీమ్ బుధవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తాజ్ మహల్ హైసెక్యూరిటీ జోన్‌లో ఓ డ్రోన్‌ను ఎగురవేశారు. వారిని సవివరంగా ప్రశ్నించినపుడు, తమకు ఇది నో ఫ్లయింగ్ జోన్ అని తెలియదని చెప్పారు. దీంతో వారిని హెచ్చరించి, వదిలిపెట్టారు. 


ఈ ముగ్గురికీ ఈ ప్రాంతంలో అమలవుతున్న ఆంక్షల గురించి తెలియదని తమ విచారణలో వెల్లడైందని, వారిని హెచ్చరించి, వదిలిపెట్టామని నగర పోలీసు సూపరింటెండెంట్ వికాస్ కుమార్ మీడియాకు చెప్పారు. 


తాజ్ మహల్ పరిసరాల్లో డ్రోన్లను వినియోగించడంపై కఠినమైన ఆంక్షలు అమలవుతున్నాయి. దీనికి సంబంధించిన ఆదేశాలను ఆగ్రా జిల్లా యంత్రాంగం 2017 ఫిబ్రవరిలో జారీ చేసింది. 


Updated Date - 2021-10-01T23:23:47+05:30 IST